ETV Bharat / international

భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్​ సలాం! - ivanka hails indian girl jyothi

బిహార్‌ బాలిక జ్యోతి కుమారిని ప్రశంసించారు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్​. తండ్రిని కూర్చొబెట్టుకొని 1200 కి.మీ ప్రయాణించడం అద్భుతమని కొనియాడారు. ఆమె ఓర్పు, ప్రేమ భారతీయ సమాజాన్ని ఆకట్టుకుందని కితాబిచ్చారు.

Bihar girl cycling 1,200 km with father impresses Ivanka Trump
భారత 'జ్యోతి'కి.. అమెరికా అధ్యక్షుడి కుమార్తె సలాం!
author img

By

Published : May 23, 2020, 10:47 AM IST

Updated : May 23, 2020, 11:33 AM IST

లాక్‌డౌన్‌ వేళ తండ్రిని కూర్చొబెట్టుకొని 12 వందల కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన బిహార్‌ బాలిక జ్యోతి కుమారిని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసించారు. 15 ఏళ్ల జ్యోతి కుమారి.. గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1,200 కిలోమీటర్ల ప్రయాణం చేయడం అద్భుతమని ఇవాంకా పేర్కొన్నారు. ఆమె ఓర్పు,ప్రేమ.. భారతీయ సమాజాన్నే కాకుండా... సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుందని ఇవాంకా ట్వీట్ చేశారు.

Ivanka Trump
ఇవాంకా ట్వీట్

బిహార్‌కు చెందిన.. 15 ఏళ్ల జ్యోతి కుమారి తండ్రి గురుగ్రామ్‌లో ఆటో రిక్షా న‌డుపుతుంటాడు. అయితే లాక్‌డౌన్ వల్ల ఆమె తండ్రి ఉపాధి కోల్పోయాడు. దీంతో పాటు ఆయన అనారోగ్యం బారిన ప‌డ‌టం వల్ల స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు జ్యోతి.. గురుగ్రామ్ వెళ్లింది. సైకిల్ వెనుక సీట్‌పై తండ్రిని కూర్చొబెట్టుకుని వారం రోజుల‌పాటు ప్రయాణం చేసి ఇంటికి చేరింది.

Ivanka Trump
జ్యోతి కుమారి
Ivanka Trump
చదువుతూ జ్యోతి కుమారి
Ivanka Trump
సైకిల్​ తొక్కుతూ జ్యోతి కుమారి

ఇదీ చదవండి:సైక్లింగ్​ ట్రయల్స్​ కోసం జ్యోతి కుమారికి పిలుపు

Last Updated : May 23, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.