గ్రీన్హౌస్ వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 2030 నాటికి ఈ కాలుష్యాన్ని 50-52 శాతం తగ్గించేలా నూతన ప్రణాళికను గురువారం ఆవిష్కరించనున్నారు. ఈ రాత్రికి ప్రారంభం కానున్న లీడర్స్ సమిట్లో ఈ లక్ష్యాలను వివరించనున్నారు.
వాతావరణ మార్పులపై జరిగే ఈ సదస్సు(లీడర్స్ సమిట్ ఆన్ క్లైమెట్)లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా, 40 దేశాల అధినేతలు పాల్గొననున్నారు. బైడెన్ నేతృత్వంలో వాతావరణ సమస్యలపై అమెరికా నిర్వహిస్తున్న తొలి శిఖరాగ్ర సదస్సు ఇదే. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఉద్గారాల తగ్గింపు వేగాన్ని పెంచడం సహా.. 2035 నాటికి విద్యుత్ రంగాన్ని కార్బన్ కాలుష్య రహితంగా మార్చాలన్న బైడెన్ లక్ష్యాలకు అనుగుణంగా తాజా ప్రణాళిక ఉంటుందని శ్వేతసౌధం తెలిపింది. 2050లోపు గ్రీన్హౌస్ ఉద్గారాలను సున్నా స్థాయికి చేర్చే విధంగా, భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేసేలా ఈ ప్రణాళిక ఉంటుందని తెలిపింది.
ఇదీ చదవండి- 'వినూత్న మార్గాల్లో 'ఆపరేషన్ ఆక్సిజన్''