ETV Bharat / international

46వ అధ్యక్షుడిగా బైడెన్- చరిత్ర సృష్టించిన కమల

అగ్రరాజ్యంలో భద్రతా బలగాల పటిష్ట పహార మధ్య... అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేశారు. ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి దక్షిణాసియా అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. వాషింగ్టన్‌లోని కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌ హిల్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమం ఆనవాయితీకి భిన్నంగా కేవలం వెయ్యి మంది ఆహూతుల సమక్షంలో జరిగింది.

Biden
46వ అధ్యక్షుడిగా బైడెన్
author img

By

Published : Jan 21, 2021, 5:17 AM IST

ఈ రోజు మనం వేడుక నిర్వహించుకుంటున్నది ఒక వ్యక్తి విజయం సాధించినందుకు కాదు.. ప్రజాస్వామ్యం గెలుపొందినందుకు. ప్రజాస్వామ్యం విలువైందనీ, సున్నితమైందనీ మనం మరోసారి తెలుసుకున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆశలు చిగురించిన రోజు. ప్రపంచ శాంతి, ప్రగతి, భద్రతలో విశ్వసనీయ భాగస్వామిగా ఉంటాం.

- బైడెన్, అమెరికా అధ్యక్షుడు‌

స్వేచ్ఛా సమానతలకూ, ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకొనే అగ్రరాజ్యంలో... అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత నడుమ... అమెరికా 46వ అధ్యక్షునిగా డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా 56 ఏళ్ల కమలా హారిస్‌ బాధ్యతలు చేపట్టారు. "చరిత్రాత్మక సంక్షోభం, సవాళ్లు నెలకొన్న ప్రస్తుత తరుణంలో... యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా పేరుకు తగ్గట్టే అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలి. అలా చేస్తే వైఫల్యానికి చోటే ఉండదు. నేను అందరి అధ్యక్షునిగా ఉంటా" అని ఈ సందర్భంగా బైడెన్‌ హామీ ఇచ్చారు.

Biden
ప్రమాణం చేస్తోన్న బైడెన్
Biden
భార్యను ముద్దాడుతోన్న బైడెన్

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం... కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌ హిల్‌ వెలుపల ఏర్పాటుచేసిన వేదిక వద్దకు బైడెన్‌ తన భార్య జిల్‌తో కలిసి చేరుకున్నారు. కమలా హారిస్‌ తన భర్త డగ్లస్‌ యెంహాఫ్‌తో కలిసి వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ బైడెన్‌తో ప్రమాణం చేయించారు. దీంతో అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షునిగా ఆయన నిలిచారు. భార్యతో కలిసి తీసుకొచ్చిన 127 సంవత్సరాల నాటి కుటుంబ బైబిల్‌పై జో ప్రమాణం చేశారు. డేలావేర్‌ సెనేటర్‌గా ఏడు సార్లు, ఉపాధ్యక్షునిగా రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన ఇదే బైబిలును ఉపయోగించారు. అంతకుముందు... కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ ప్రమాణం చేయించారు. ఆమె రెండు బైబిళ్లపై ప్రమాణం చేశారు. అందులో ఒకటి ఆమె కుటుంబ స్నేహితురాలైన రెజీనా షెల్టన్‌కు చెందినది కాగా, మరొకటి సుప్రీంకోర్టు తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌ న్యాయమూర్తి జస్టిస్‌ థర్‌గుడ్‌ మార్షల్‌ది. ఈ పదవిని అలంకరించిన తొలి దక్షిణాసియా, తొలి నల్లజాతి వ్యక్తి కూడా హారిస్‌ కావడం విశేషం. ఆమె తల్లి భారత్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లగా, తండ్రి జమైకా నుంచి వచ్చినవారు.

Biden
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తున్న కమలా హారిస్‌
Biden
కుటుంబ సభ్యులతో జో బైడెన్‌, కమలా హారిస్‌

గంభీర వాతావరణంలో...

Biden
బైడెన్‌ ప్రమాణస్వీకార మహోత్సవ ప్రాంగణం

అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవమంటే ఎంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. లక్షల మంది అభిమానులు, సాధారణ పౌరులు పాల్గొనడం ఆనవాయితీ. కానీ, ఈసారి సుమారు వెయ్యి మంది మాత్రమే హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా-మిషెల్‌, బిల్‌ క్లింటన్‌-హిల్లరీ, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌-లారా దంపతులు హాజరయ్యారు. ఎన్నికలను ధ్రువీకరించేందుకు ఈనెల 6న కాంగ్రెస్‌ సమావేశమైన సందర్భంగా... ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌పై దాడికి పాల్పడ్డారు. ఆ హింసాకాండలో ఐదుగురు మరణించారు. బైడెన్‌ ప్రమాణ స్వీకారం రోజూ ఇలాంటి అల్లర్లే చోటుచేసుకోవచ్చని, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లోని క్యాపిటల్‌ భవనాలపై దాడులు జరగవచ్చని ఎఫ్‌బీఐ, రక్షణశాఖ వర్గాలు హెచ్చరించింది. భద్రతా బలగాలకు చెందిన కొందరు సిబ్బంది సైతం దాడికి పాల్పడవచ్చని అప్రమత్తం చేశాయి. దీంతో క్యాపిటల్‌ హిల్‌ పరిసరాల్లో 25 వేలకు పైగా మంది సిబ్బందిని నేషనల్‌ గార్డ్స్‌ బ్యూరో మోహరించింది. ముందుజాగ్రత్త చర్యగా నేషనల్‌ గార్డ్స్‌కే చెందిన 12 మంది అనుమానితులను ఉన్నతాధికారులు సేవల నుంచి తొలగించారు. అతిథుల కంటే భద్రతా సిబ్బందే అధిక సంఖ్యలో ఉండటం విశేషం.

Biden
కమలా హారిస్​కు బరాక్​ ఒబామా అభినందనలు
Biden
ప్రమాణస్వీకారం వేళ బైడెన్‌, కమలా హారిస్‌ ఇలా..

ట్రంప్‌ వీడియో సందేశం...

కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత అధ్యక్షుడు హాజరుకావడం సంప్రదాయం. దీనికి విరుద్ధంగా బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి ట్రంప్‌ హాజరు కాలేదు. 1869లో ఆండ్రూ జాన్సన్‌ తర్వాత... తదుపరి అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాని వ్యక్తి డొనాల్డే! ఆయన శ్వేతసౌధాన్ని వీడి, తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడాలోని మార్‌-ఎ-లాగో రిసార్ట్‌కు వెళ్తూ... చివరిగా ఓ వీడియో సందేశం ఇచ్చారు. "కొత్త అధ్యక్షునికి శుభాకాంక్షలు. వారికి అదృష్టం కూడా కలిసి రావాలని ఆశిస్తున్నా. అది చాలా ముఖ్యమైన విషయం" అని ఆయన నొక్కి చెప్పారు.

భారతీయం...

బైడెన్‌ తన బృందంలో 20 మందికిపైగా భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమించారు. వీరిలో 13 మంది మహిళలే కాగా, 17 మంది శక్తిమంతమైన శ్వేతసౌధ కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తించనున్నారు. దేశంలో సుమారు 1% మందే ఉన్న భారతీయ అమెరికన్‌ సామాజికవర్గానికి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పదవులు దక్కాయి.

'ట్రంప్‌ అధికారుల'పై చైనా ఆంక్షలు!

డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారులో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన దాదాపు 30 మందిపై చైనా సర్కారు ఆంక్షలు విధించింది. నూతన అధ్యక్షుడు బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే చైనా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ట్రంప్‌ హయాంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన మైక్‌ పాంపియో, జాతీయ భద్రత సలహాదారుడు రాబర్ట్‌ ఓబ్రియెన్‌, ఐరాస రాయబారి కెల్లీ క్రాఫ్ట్‌ సహా పలువురిపై ప్రయాణ ఆంక్షలు, కార్యకలాపాల పరమైన ఆంక్షలు విధించింది. ఇవి నామమాత్రమైనా అమెరికాపై చైనాకు ఉన్న వైరాన్ని చాటుతున్నాయి.

మన వినయ్‌ రాసిందే...

బైడెన్‌ ప్రసంగాన్ని భారతీయ అమెరికన్‌, తెలుగు బిడ్డ వినయ్‌రెడ్డి రాయడం విశేషం! ఎన్నికల సందర్భంగా జో పేర్కొన్న పలు అంశాలను మేళవించి, 'అమెరికా యునైటెడ్‌' థీమ్‌తో ఈ ప్రసంగాన్ని రాశారు. తన కుటుంబంతో కలిసి ఒహాయోలోని డేటన్‌లో ఉంటున్న వినయ్‌... 2013-17 మధ్య బైడెన్‌ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడూ ఆయన ముఖ్య ప్రసంగ రచయితగా పనిచేశారు. ఇప్పుడు అధ్యక్షుని ప్రసంగం రాసిన తొలి భారతీయ అమెరికన్‌గానూ నిలిచారు.

కమలా హారిస్‌కు'గుడ్‌ మ్యాన్‌' తోడు

ప్రమాణ స్వీకార వేదిక వద్దకు కమలా హారీస్‌ను హీరోగా ప్రశంసలు అందుకున్న నల్లజాతి పోలీసు అధికారి యూజీన్‌ గుడ్‌మ్యాన్‌ తోడ్కొని వచ్చారు. క్యాపిటల్‌ భవనంపై దాడి జరిగినప్పుడు ఉపాధ్యక్షుడు పెన్స్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు, ఆందోళనకారులను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. లాంఛనప్రాయంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

అమెరికా తాత్కాలిక విదేశాంగ మంత్రిగా డేనియల్‌ స్మిత్‌

అమెరికా తాత్కాలిక విదేశాంగ మంత్రిగా డేనియల్‌ స్మిత్‌ వ్యవహరించనున్నారు. ఈ పదవికి ఆంటోనీ బ్లింకెన్‌ నియామకాన్ని సెనేట్‌ ఖరారు చేసేవరకు స్మిత్‌ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్మిత్‌ గతంలో గ్రీస్‌ రాయబారిగా వ్యవహరించారు. అమెరికా దౌత్యవేత్తలకు శిక్షణ అందించే సంస్థను ఆయన నడిపిస్తున్నారు.

నటుల సంఘం నుంచి ట్రంప్‌ తొలగింపు

ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు సినిమాలు, టీవీల్లో నటించే అవకాశాలు రావడం కష్టంగా మారవచ్చు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయనున్నట్టు సినీ యాక్టర్స్‌ గిల్డ్‌ ప్రకటించింది. తన అనుచరులతో క్యాపిటల్‌ భవనంపై దాడి చేయించినందున క్రమశిక్షణ చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఆయనకు 1989 నుంచి ఈ సంఘంలో సభ్యత్వం ఉంది. పలు సినిమాల్లో నటించారు కూడా.

బైడెన్‌కు లేఖ విడిచి వెళ్లిన ట్రంప్‌!

శ్వేతసౌధాన్ని వీడుతూ... నూతన అధ్యక్షుడు బైడెన్‌ను ఉద్దేశించి ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసులో ఓ లేఖను విడిచిపెట్టి వెళ్లారు. కొత్త ప్రెసిడెంట్‌కు పాత అధ్యక్షుడు ఇలా సందేశమివ్వడం ఆనవాయితీ. ప్రథమ పౌరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ... మద్దతుగా ఉంటానని, పదవీ కాలమంతా ప్రశాంతంగా ముగియాలని కోరుకుంటున్నట్టు అందులో పేర్కొంటారు. అయితే- అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిజమైన గెలుపు తనదేనని చెబుతూ వచ్చిన ట్రంప్‌... అధికార బదిలీకి సంబంధించిన ప్రతి సంప్రదాయానికీ అడ్డు తగులుతూ వచ్చారు. చివరికి బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. కానీ... ఈ లేఖ ఆనవాయితీని మాత్రం ఆయన పాటించడం విశేషం!

ఉర్రూతలూగించిన లేడీ గాగా, జెన్నిఫర్‌ లోపెజ్‌...

Biden
భార్యతో కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి చేరుకుంటున్న బైడెన్‌
Biden
ప్రమాణస్వీకార మహోత్సవంలో గీతాన్ని ఆలపిస్తున్న జెన్నీఫర్‌ లోపెజ్‌

కొత్త అధ్యక్షుని ప్రమాణం సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకలో ప్రముఖ పాప్‌ సింగర్‌ లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రముఖ గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌.. 'దిస్‌ లాండ్‌ ఈజ్‌ యువర్‌ లాండ్‌, అమెరికా ద బ్యూటిఫుల్‌' పాటలతో ఉర్రూతలూగించారు. ప్రఖ్యాత గాయకుడు గార్త్‌ బ్రూక్స్‌ 'అమేజింగ్‌ గ్రేస్‌' గీతాన్ని ఆలపించారు. ఇందులో భాగంగానే 90 నిమిషాల పాటు 'సెలబ్రేటింగ్‌ అమెరికా' పేరుత ప్రముఖ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. దీనికి టామ్‌ హ్యాంక్స్‌ నేతృత్వం వహించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలను పలు టీవీ ఛానళ్లతో పాటు...ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాలు ప్రసారం చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.