ETV Bharat / international

చైనాపై సుంకాలను వెంటనే ఎత్తివేయను: బైడెన్​ - జో బైడెన్.

పదవీ బాధ్యతలు చేపట్టగానే చైనా ఎగుమతులపై ఉన్న సుంకాలను ఎత్తివేయబోనని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ అన్నారు. ఆ దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

Biden says he wont immediately lift China tariffs
చైనాపై సుంకాలను వెంటనే ఎత్తివేయను: బైడెన్​
author img

By

Published : Dec 3, 2020, 5:47 AM IST

అధికారం చేపట్టిన వెంటనే చైనా ఎగుమతులపై సుంకాలను ఎత్తివేయబోనని స్పష్టం చేశారు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగిస్తానని తెలిపారు. అయితే భౌగోళిక, రాజకీయ శత్రువైన చైనాతో తన పరపతిని పెంచుకుంటానని అన్నారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్​ ఓ కథనం ప్రచురించింది.

ట్రంప్​ హయాంలో అమెరికా, చైనాలు ఏడాది పొడవునా వాణిజ్య యుద్ధానికి పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకుంటానని జో బైడెన్​ తెలిపారు. చైనాతో చర్చలు జరుపుతానని వెల్లడించారు.

ఇదీ చూడండి:క్షమాభిక్షలపై దర్యాప్తు ఓ ఫేక్‌ న్యూస్‌: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.