వైద్య సేవల కోసం అయ్యే ఖర్చును భరించలేని వలసదారులు అమెరికాకు రాకుండా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. ట్రంప్ చేసిన ఆ ప్రకటన అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా లేదని బైడెన్ పేర్కొన్నారు.
"అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆరోగ్య బీమాను కొనుగోలు చేయలేని వలసదారులపై నిషేధం విధించకుండానే ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ఉత్తర్వులకు అనుగుణంగా జారీ అయిన విధివిధానాలను అధికారులు పరిశీలించి చక్కదిద్దుతారని బైడెన్ తెలిపారు.
2019లో ట్రంప్ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. అమెరికాలోకి వచ్చిన వలసదారులు 30 రోజుల్లోగా ఆరోగ్య బీమాను తీసుకోవాలి. లేదా వైద్య ఖర్చులు భరించే స్తోమత తమకు ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఆ విషయంలో హెచ్1బీ వీసాదారుల వెంటే గూగుల్!