ETV Bharat / international

'ప్రమాణ స్వీకారం'లో కరోనా మృతులకు నివాళి - కరోనా మృతులకు 'ప్రమాణస్వీకారం'లో సంఘీభావం

అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కరోనా మృతులకు సంఘీభావం తెలపనున్నారు. మరణించినవారి జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా చర్చిల్లో గంటలు మోగించనున్నారు.

Biden inauguration eve to feature memorial ceremony for COVID-19 victims
'ప్రమాణస్వీకారం'లో కరోనా మృతులకు సంఘీభావం
author img

By

Published : Jan 1, 2021, 3:25 PM IST

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా సంఘీభావం ప్రకటించనున్నారు. మృతుల జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

జనవరి 19న సాయంత్రం 5.30 గంటలకు దేశవ్యాప్తంగా మెమోరియల్​లు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడి ప్రమాణస్వీకార కమిటీ(పీఐసీ) తెలిపింది. వాషింగ్టన్​లోని 'లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్​'లో లైటింగ్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఆహ్వానించనున్నట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో దేశంలోని చర్చిలన్నీ గంట మోగించాలని పిలుపునిచ్చింది.

అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా మహమ్మారి వల్ల నిరాడంబరంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: బైడెన్​ ప్రమాణ స్వీకారానికి ట్రంప్​ వెళతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.