మార్పు మంత్రంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, కమలా హారిస్‌కు మరో గౌరవం దక్కింది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ వారిద్దరినీ సంయుక్తంగా 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపిక చేసింది.
తుది జాబితాలో బైడెన్, కమలతో పాటు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. చివరకు బైడెన్-కమల ఎంపికయ్యారు.
"అమెరికా చరిత్ర మార్చినందుకు, విచ్ఛిన్నకర శక్తులకన్నా సహానుభూతే గొప్పదని నిరూపించినందుకు, కష్టాల్లో ఉన్న ప్రపంచానికి ఊరట కలిగించే ప్రణాళికను ఆవిష్కరించినందుకు బైడెన్-కమలను పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేశాం"
- ఎడ్వర్డ్ ఫెల్సెన్తల్, టైమ్ మ్యాగజైన్ ప్రధాన సంపాదకులు
- '2020 గార్డియన్స్ ఆఫ్ ద ఇయర్' గా.. ఆంటోనీ పౌచీ, కరోనాపై ముందుడి పోరాడుతోన్న ఆరోగ్య సిబ్బంది, జాతివివక్షపై పోరాడిన కార్యకర్తలను ఎంపిక చేసింది టైమ్.
- 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా.. కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం 'జూమ్' ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎరిక్ యాన్ ఎంపికయ్యారు.
- 'ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్'గా.. దక్షిణ కొరియాకు చెందిన బాండ్ బీటీఎస్‌ను ఎంపిక చేసింది.
- 'అథ్లెట్ ఆఫ్ ద ఇయర్'గా.. అమెరికాకు చెందిన బాస్కెట్ బాల్ ఆటగాడు లీబ్రోన్ జేమ్స్ ఎంపికయ్యారు.
గత ఏడాది స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఎంపికైన వారిలో థన్‌బర్గ్ అతిపిన్నవయస్కురాలు కాగా.. ఈ ఏడాది 78 ఏళ్ల అతిపెద్ద వయస్కుడిగా బైడెన్ ఎంపికవటం గుర్తించదగిన విషయంగా పేర్కొంది టైమ్ మ్యాగజైన్.
ఇదీ చూడండి: 'దివాలా' సంస్థకు రుణం- చిక్కుల్లో ట్రంప్ అల్లుడు!