వైట్‌హౌస్‌లో తాను నివసించేందుకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నానని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. గత అధ్యక్షులు చెప్పినట్టుగానే అధ్యక్ష భవనాన్ని బంగారు పంజరంతో పోల్చారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు వారాల అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"నేను ఉదయం నిద్ర లేచిన తర్వాత జిల్‌తో మనం ఎక్కడున్నామని అడుగుతాను(నవ్వుతూ). శ్వేతసౌధం సిబ్బంది నాకోసం ఎదురు చూడాలని అనుకోను. నాకు నేను అన్ని పనులు చేసుకోవాలనుకుంటాను."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్ నగరంలో బైడెన్ అంతకుముందు కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలే.. ఆయన డెలావేర్‌లోని విల్లింగ్టన్లో ఓ పెద్ద ఇంటికి మకాం మార్చారు.
తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నివసించిన భవనంతో పోలిస్తే.. అధ్యక్ష భవననం చాలా భిన్నంగా ఉందని బైడెన్ అన్నారు. తాను ఓవల్ ఆఫీస్‌లో ఎన్నో సార్లు వెళ్లినప్పటికీ.. వైట్‌హౌస్‌లోని నివాస ప్రాంతాల్లోకి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు.
ఒక్కరు తప్ప..
ఇన్నిరోజుల తర్వాత కూడా నివాస భవనం కొత్తగానే అనిపిస్తుందంటే.. తాను పనిలో బాగా నిమగ్నమయయ్యాననే అర్థమని బైడెన్ అన్నారు. అంతకుముందు వైట్‌హౌస్‌లో నివసించిన కొంతమందితో ఫోన్లో తాను మాట్లాడానని స్పష్టం చేశారు. కానీ, వారెవరో మాత్రం చెప్పలేదు. ఒక్కరు తప్ప అందరూ తనతో మాట్లాడారని తెలిపారు.