ETV Bharat / international

పెరిగిన నిరుద్యోగం.. సమర్థించుకున్న బైడెన్​ - అమెరికాలో కొత్త ఉద్యోగాలు

అమెరికాలో నిరుద్యోగం మరింత పెరిగింది. కొత్తగా పది లక్షల ఉద్యోగాలు వస్తాయని అమెరికా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే ఆ దేశ కార్మికశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం అవి కేవలం 2లక్షల 66 వేలకు మాత్రమే పరిమితం అయినట్లు స్పష్టం అయ్యింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్​ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేవలం మూడు నెలల్లో పెద్దమొత్తంలో ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.

Biden
అమెరికాలో పెరిగిన నిరుద్యోగం.. కొట్టిపారేసిన బైడెన్​
author img

By

Published : May 8, 2021, 10:16 AM IST

అమెరికాలో ఎప్రిల్​ నెలలో.. కొత్తగా పదిలక్షల ఉద్యోగాలు వస్తాయని అక్కడి ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేసిన వేళ.. కొత్త ఉద్యోగాలు కేవలం 2 లక్షల 66 వేలకు మాత్రమే పరిమితం అయినట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది. అదే సమయంలో నిరుద్యోగ రేటు 6.0 నుంచి 6.1శాతానికి పెరిగినట్లు పేర్కొంది. కరోనా వైరస్​ కారణంగా గతేడాది ఆగస్టు నుంచి ఎక్కువమంది పని చేయడానికి మొగ్గు చూపడంలేదని అమెరికా కార్మిక కార్యదర్శి మార్టి వాల్ష్​ తెలిపారు. కొవిడ్​ విజృంభణకు ముందున్న 80 లక్షల ఉద్యోగాలను తిరిగి పొందాలంటే మరింత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

అమెరికాలో నిరుద్యోగం పెరగడం కారణంగా రాజకీయ, వ్యాపార వర్గాల నుంచి అధ్యక్షుడు జో బైడెన్​పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీనిపై బైడెన్​ స్పందించారు. కరోనా నుంచి కోలుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ప్రణాళిక ప్రకారం సరైన దిశలో పయనిస్తోందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే 15లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన మూడు నెలల్లోనే ఇంత పెద్దమొత్తంలో ఉద్యోగాలు కల్పించడం గతంలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. అయితే.. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వందశాతం టీకా పంపిణీ చేయడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం అనేవి తమ తక్షణ కర్తవ్యాలుగా ఉన్నాయని బైడెన్​ వివరించారు.

వాతావరణ మార్పులకు ప్రత్యేక కార్యాలయం..

వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయాన్ని(సీసీఎస్​ఓ) ఏర్పాటు చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా విదేశాంగ శాఖలో భాగంగా సీసీఎస్​ఓ తన విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపిన బైడెన్​.. వాటిని పరిష్కరించడానికి అగ్రరాజ్యం చొరవ చూపిందని తెలిపారు. అమెరికాతో కలిసి వచ్చే దేశాలతో పర్యావరణ హితం కోసం ప్రాజెక్టులను చేపట్టడమే సీసీఎస్​ఓ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'టీకాల ఎగుమతిపై అమెరికా చర్యలు చేపట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.