ETV Bharat / international

భారత్​లో అమెరికా రాయబారిగా లాస్​ఏంజెల్స్​ మేయర్​! - భారత్​కు అమెరికా రాయబారి

భారత్​లో అమెరికా రాయబార పదవికి లాస్​ఏంజెల్స్​ మేయర్​ ఎరిక్​ గార్సెట్టీ పేరును పరిశీలిస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

Eric Garcetti  Ambassador to India, భారత్​కు అమెరికా రాయబారి
లాస్​ఏంజెల్స్​ మేయర్ ఎరిక్​ గార్సెట్టీ
author img

By

Published : May 5, 2021, 1:29 PM IST

అమెరికా అధ్యక్షుడు బైడెన్​.. భారత్​లో అమెరికా రాయబారిగా లాస్​ఏంజెల్స్​ పట్టణ మేయర్​ ఎరిక్​ గార్సెట్టీ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాయబారి పదవికి వివిధ అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నా.. గార్సెట్టీ పేరు ముందువరుసలో ఉన్నట్లు యాక్సియెస్​ అనే వార్తా సంస్థ వెల్లడించింది.

దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో అమెరికా రాయబారి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయబారి నియామకానికి సంబంధించి అభ్యర్థుల జాబితాను అధికారులు బైడెన్​కు మార్చిలోనే సమర్పించినా.. అధ్యక్షుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

అధ్యక్ష ఎన్నికల సమయంలో గార్సెట్టీ బైడెన్​ తరపున ప్రచార నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి : 'కరోనా విషయంలో భారత్​కు మద్దతుగా నిలువొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.