ETV Bharat / international

బైడెన్​ రాకకు వేళాయే.. ప్రమాణానికి సర్వం సిద్ధం

మరికొద్ది గంటల్లో అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాధారణంగా అగ్రరాజ్య అధినేత ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. అయితే ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్​ మొండివైఖరి.. క్యాపిటల్​ భవనంలో ఆయన మద్దతుదారులు సృష్టించిన హింస నేపథ్యంలో అత్యంత భద్రత నడుమ సాదాసీదాగా జరగనుంది.

author img

By

Published : Jan 20, 2021, 5:08 AM IST

Biden
బైడెన్​

అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్ నేడు​ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కొద్ది గంటల్లో మొదలయ్యే ఈ వేడుకలను ప్రపంచం యావత్తూ ఆసక్తిగా గమనించనుంది. ఈ కార్యక్రమ భద్రతా ఏర్పాట్లు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. వాషింగ్టన్​ను తమ అధీనంలోకి తీసుకున్న సైన్యం సుమారు 25వేల మంది సిబ్బందిని మోహరించింది. సైన్యం కనుసన్నల్లో జరిగే ప్రమాణస్వీకార వేడుకగా ఇది నిలిచిపోనుంది.

ఎన్నో సవాళ్ల నడుమ..

ఇక ట్రంప్ మద్దతుదారుల హింస, బెదిరింపులకు సంబంధించి నివేదికలు అందిన నేపథ్యంలో.. అమెరికా రాజధాని ప్రాంతమంతా బలగాలతో నిండిపోయింది. వాషింగ్టన్​ క్యాపిటల్ హిల్​ భవనం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు.. పెన్సిల్వేనియా, వైట్ హౌస్ పరిసరాల్లో ఎనిమిది అడుగుల ఎత్తైన బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలకు సైతం అనుమతి లేదు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో హింస జరిగే అవకాశం ఉందన్న ఎఫ్​బీఐ హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాల వద్ద నిఘాను పెంచారు.

ప్రతిదీ ప్రత్యేకమే..

అమెరికాకు అతిపెద్దవయస్కుడైన అధ్యక్షుడిగా జో బైడెన్‌ చరిత్ర సృష్టించబోతున్నారు. 78ఏళ్ల బైడెన్​ తన భార్య జిల్​ బైడెన్​తో కలసి.. 127ఏళ్ల చరిత్ర కలిగిన తమ కుటుంబ బైబిల్​పై ప్రమాణం చేస్తారు. బైడెన్ కుటుంబానికి సన్నిహితుడైన ఫాథర్​ లియో జెరెమియా ఓడోనోవన్ రాకతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. జార్జియాలోని సౌత్ ఫుల్​టన్‌ ఫైర్ రెస్క్యూ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న తొలి ఆఫ్రో-అమెరికన్ మహిళా కెప్టెన్‌ ఆండ్రియా హాల్ అధ్యక్షుని ప్రారంభ ప్రతిజ్ఞను చదవనున్నారు. అధ్యక్షునిగా బైడెన్​ ఇవ్వబోయే యునైటెడ్​ అమెరికా థీమ్​ చారిత్రక ప్రసంగాన్ని భారతీయ-అమెరికన్ వినయ్​ రెడ్డి రచించడం విశేషం.

హారిస్​ శకం ఆరంభం..

మొట్టమొదటి మహిళగా, నల్లజాతీయురాలిగా, మొదటి దక్షిణాసియా అమెరికన్​గా.. అమెరికా ఉపాధ్యక్షురాలి బాధ్యతలు స్వీకరించనున్నారు 56 ఏళ్ల కమలా హారిస్. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

సెలబ్రేటింగ్ అమెరికా..

బైడెన్, హారిస్​లు శాంతియుత అధికార బదిలీ 'పాస్ ఇన్ రివ్యూ' అనే సంప్రదాయ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే వర్జీనియాలోని ఆర్లింగ్టన్ నేషనల్ శ్శశానవాటికను సందర్శిస్తారు. సైనికులకు నివాళులర్పిస్తారు. అనంతరం శ్వేతసౌధంలో అడుగు పెట్టే వీరికి అధికారిక ఎస్కార్ట్ తోడవుతుంది. దీంతో అమెరికా అంతటా వర్చువల్​ పరేడ్ మొదలవుతుంది. కరోనా కారణంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సెలబ్రేటింగ్ అమెరికా పేరుతో వర్చువల్​గా ప్రసారం చేయాలని బైడెన్ నిర్ణయించారు. సామాజిక దూరం నిబంధనలకు అనుగుణంగా టీవీల్లో వీక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా హాలీవుడ్​ తారలు..

ప్రముఖ పాప్​ గాయని లేడీగాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించనుంది. ప్రముఖ హాలీవుడ్​ నటి జెన్నీఫర్​ లోపెజ్​ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనుంది. అదేవిధంగా 2017 యూత్​ పోయెట్​ లారెట్​ బహుమతి గ్రహీత అమండా గోర్మాన్ ది హిల్ వి క్లైమ్ అనే కవితను చదివి వినిపిస్తారు.

లేఖ ఉండకపోవచ్చు..

సంప్రదాయం ప్రకారం ఓవల్ కార్యాలయంలో తనకు కేటాయించిన కుర్చీలో బైడెన్ కూర్చుంటారు. అప్పటివరకూ ఉన్న అధ్యక్షడి నుంచి అందే అధికారిక లేఖతో అధికారిక బదిలీ పూర్తవుతుంది. అయితే ఓటమిని అంగీకరించని ట్రంప్ వైఖరితో ఈసారి అధికారిక లేఖ ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరుకానని ప్రకటించిన ట్రంప్.. కార్యక్రమానికి కొన్ని గంటల ముందు వైట్ హౌస్​ను ఖాళీ చేయనున్నారు.

ఇవీ చదవండి:

'బైడెన్'​ ప్రమాణ స్వీకారంలో లేడీ గాగా, జెన్నీఫర్ సందడి

బుధవారమే ప్రమాణం.. రికార్డు సృష్టించనున్న బైడెన్​

బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సవం షెడ్యూల్​ ఇలా...

బైడెన్​ బృందంలో ట్రాన్స్​జెండర్​కు చోటు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.