ETV Bharat / international

అమెరికా నుంచి భారత్​కు పీ-8ఐ నిఘా విమానాలు! - భారత్ అమెరికా దౌత్య సంబంధాలు

దేశ పహారాలో నిఘా కోసం ఉపయోగించే ఆరు పీ-8ఐ విమానాలను భారత్​కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ అమెరికన్ కాంగ్రెస్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందించింది. వీటి కొనుగోలుకు సుమారు 2.42 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా.

P-8I patrol aircraft
పీ -8ఐ విమానాలు
author img

By

Published : May 1, 2021, 10:19 AM IST

Updated : May 1, 2021, 10:58 AM IST

భారత్‌కు ఆరు పీ-8ఐ నిఘా విమానాలను విక్రయించే ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జో బైడెన్‌ అధికార యంత్రాంగం కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చింది. ప్రతిపాదిత విమానాల విక్రయ ప్రక్రియ వల్ల అమెరికా-భారత్‌ వ్యూహాత్మక బంధం బలోపేతమై.. విదేశాంగ విధానానికి, జాతీయ భద్రతకు మద్దతు లభిస్తుందని ఈ సంస్ధ తెలిపింది.

అతి పెద్ద రక్షణ భాగస్వామి అయిన భారత్‌ భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొంది. ఇండో పసిఫిక్‌, దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్ధిరత, శాంతి, సహకారం నెలకొనడంలో భారత్‌ కీలక శక్తిగా కొనసాగుతోందని కాంగ్రెస్‌కు ఇచ్చిన సమాచారంలో అమెరికా రక్షణ సహకార సంస్ధ అభిప్రాయపడింది. అమెరికా నుంచి ఆరు పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలుకు 2.42 బిలియన్‌ డాలర్లు ఖర్చు కావొచ్చని అంచనా.

ఇవీ చదవండి: కరోనా కట్టడి కోసం భారత్​కు 'బోయింగ్' సాయం

'భారత్​లో పరిస్థితులు విషాదకరం.. సాయం చేస్తాం'

Last Updated : May 1, 2021, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.