ఏషియన్ అమెరికన్ వృద్ధురాలిపై ఓ దుండగుడు న్యూయార్క్ నడివీధిలో పిడి గుద్దులతో దాడి చేశాడు! సోమవారం మధ్యాహ్నం మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కీలక సాక్ష్యాధారంగా మారింది.
65 ఏళ్ల వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా.. దుండగుడు వచ్చి మొదట ఆమె మొహంపై కొట్టాడు. తర్వాత పిడికిలి బిగించి వృద్ధురాలి కడుపు భాగంలో పదేపదే గుద్దాడు. దీంతో ఆమె నేలపై పడి విలవిల్లాడుతుండగా.. అతడు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దాడి సమయంలో అతడు ఆసియాకు వ్యతిరేక నినాదాలు చేసినట్లు తెలిసింది. ఈ ఘటన సమయంలో చుట్టుపక్కల జనం చూస్తున్నారే తప్ప ఎవరూ అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. బాధితురాలు తీవ్రంగా గాయపడిందని, చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై హేట్ క్రైమ్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేపడుతోంది.
గత ఏడాది మార్చి 19 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకూ విద్వేషపూరిత నేరాలకు సంబంధించి మొత్తం 3,795 కేసులు నమోదైనట్టు 'స్టాప్ ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ హేట్' సంస్థ పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్క న్యూయార్క్‌లోనే ఏషియన్లపై దాడులకు సంబంధించి 33 కేసులు నమోదయ్యాయి.
బైడెన్ ఆగ్రహం..
ఏషియన్ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వారిపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకునేది లేదని బైడెన్ ఘాటుగా ట్వీట్ చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
-
We can’t be silent in the face of rising violence against Asian Americans. That’s why today I’m taking additional steps to respond–including establishing an initiative at the Department of Justice to address anti-Asian crimes.
— President Biden (@POTUS) March 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
These attacks are wrong, un-American, and must stop.
">We can’t be silent in the face of rising violence against Asian Americans. That’s why today I’m taking additional steps to respond–including establishing an initiative at the Department of Justice to address anti-Asian crimes.
— President Biden (@POTUS) March 30, 2021
These attacks are wrong, un-American, and must stop.We can’t be silent in the face of rising violence against Asian Americans. That’s why today I’m taking additional steps to respond–including establishing an initiative at the Department of Justice to address anti-Asian crimes.
— President Biden (@POTUS) March 30, 2021
These attacks are wrong, un-American, and must stop.
ఇదీ చూడండి: టెక్సాస్ నిర్బంధ కేంద్రంలో 4,000 మంది వలసదారులు!