బ్రెజిల్లో అల్టామిరా రీజనల్ రికవరీ కేంద్ర కారాగారంలో ఖైదీల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 52 మంది మృతి చెందారు. వీరిలో 16 మంది తలలు, మొండెం విడిపోయిన స్థితిలో కనిపించాయని జైలు అధికారులు తెలిపారు. మిగతా వారు ఊపిరి ఆడక చనిపోయినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు(అల్పాహారం సమయంలో) ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో జైలుకు మంటలు పెట్టారు ఖైదీలు. పెద్ద ఎత్తున జ్వాలలు, పొగలు రావటం వల్ల సుమారు ఐదు గంటల పాటు అధికారులు లోపలికి వెళ్లలేకపోయారు.
జైళ్లలో పెరుగుతున్న ఘర్షణలు...
బ్రెజిల్లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. మే నెలలో ఆమజొనాస్ రాష్ట్రంలోని పలు కారాగారాల్లో జరిగిన వరుస ఘర్షణలకు సుమారు 55 మంది ఖైదీలు బలయ్యారు. 2017లో బ్రెజిల్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 120 మంది ఖైదీలు మరణించారు. పెరుగుతున్న నేరాలను అక్కడి అధికారులు నియంత్రించలేకపోతున్నారు.
ఇదీ చూడండి:ే్ అమెరికా ఫుడ్ ఫెస్ట్‌లో కాల్పులు- ముగ్గురి మృతి