ETV Bharat / international

'అమెరికాకు అసలైన అర్థం.. నా బృందం' - అమెరికా ప్యాకేజీ

అమెరికా తత్వం తన మంత్రివర్గంలో ప్రతిబింబిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ అభివర్ణించారు. కేబినెట్​ తొలి సమావేశాన్ని గురువారం ఆయన నిర్వహించారు. ​అమెరికా వాసులకు తాము ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయబోతున్నామని చెప్పారు.

joe biden Cabinet
'అమెరికాకు అసలైన అర్థం.. నా బృందం'
author img

By

Published : Apr 2, 2021, 12:59 PM IST

​అమెరికా పదానికి అసలైన అర్థం తన మంత్రివర్గంలో ప్రతిబింబిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు తాము ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని అమలు చేయబోతున్నామని తెలిపారు. కేబినెట్​ తొలి సమావేశాన్ని బైడెన్ గురువారం ​ నిర్వహించారు. అమెరికా మౌలిక రంగం కోసం ప్యాకేజీని ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.

మౌలిక రంగం కోసం ప్రకటించిన ప్యాకేజీ బాధ్యతలను తన కేబినెట్​లోని ఐదుగురు మంత్రులకు అప్పగిస్తూ​ బైడెన్​ నిర్ణయం తీసుకున్నారు. వీరు చేసే ఖర్చులను కేబినెట్​ మొత్తం పర్యవేక్షించాలని ఆదేశించారు. కొవిడ్​ నిబంధనల మధ్య ఈ భేటీ జరిగింది.

విభిన్న వ్యక్తులు..

అమెరికాలో బైడెన్​ మంత్రివర్గం.. అంతకుముందు ఉన్న అధ్యక్షులతో పోలిస్తే విభిన్నంగా ఉంది. అమెరికా ఉపాధ్యక్షురాలు భారతీయ అమెరికన్​ కమలా హారిస్​ సహా విభిన్న నేపథ్యం నుంచి వ్యక్తులు ఆయన బృందంలో ఉన్నారు. రక్షణ మంత్రి హోదాలో మొదటి నల్లజాతీయుడు లాయిడ్​ ఆస్టిన్​, రవాణా మంత్రిగా స్వలింగ సంపర్కుడు పీట్​ బట్టగీగ్​, ఆర్థిక మంత్రిగా మొదటి మహిళ జానెత్ యెలెన్​ వంటి వారు ఉన్నారు.

ఇదీ చూడండి:బైడెన్​ ఈస్టర్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.