ETV Bharat / international

ఆర్మేనియా కోసం అమెరికాలో భారీ ర్యాలీ - నాగొర్నొ-కరాబాఖ్​ కోసం నిరసనలు

లాస్​ ఏంజెల్స్​లో జనం భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్టారు. నాగొర్నో-కరాబాఖ్ ప్రాంతం ఆక్రమణ కోసం అజర్​బైజాన్​, టర్కీ కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు.

Protest_Los Angeles
లాస్​ ఏంజెల్స్​లో భారీ నిరసన
author img

By

Published : Oct 12, 2020, 5:22 PM IST

అమెరికా లాస్​ ఏంజెల్స్​లో వేల మంది జనం రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆర్మేనియాలోని నాగొర్నో-కరాబాఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ఆజర్​బైజాన్​, టర్కీ సంయుక్తంగా కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించారు.

లాస్​ ఏంజెల్స్​లో భారీ నిరసన

నాగొర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య ఘర్షణ సెప్టెంబర్ 27న తీవ్ర రూపం దాల్చింది. పరస్పర దాడుల్లో వందలాది మంది మరణించారు. రష్యా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చినా... ఎంతో కాలం నిలవలేదు. ఒడంబడికను ఉల్లంఘించింది మీరంటే మీరంటూ ఆర్మేనియా-అజర్​బైజాన్ పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఎక్కువగా ఉండే ఆర్మేనియా ప్రజలు ఈ నిరసనలు చేపట్టారు.

ఇదీ చదవండి: భూమి దిశగా దూసుకొస్తున్న పాత రాకెట్: నాసా​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.