ETV Bharat / international

మీ గుండె కుడివైపున ఉందని తెలిస్తే..! - కుడివైపు గుండె ఉన్నవాళ్లు ఎవరు?

గుండె ఎక్కడుంటుంది అని అడిగితే టక్కున సమాధానం చెబుతాం. ఎడమవైపే ఉంటుందిగా అని.. ప్రశ్న అడిగిన వారిపై అసహనమూ ప్రదర్శిస్తాం. కానీ.. అమెరికాకు చెందిన 19 ఏళ్ల క్లెయిర్ మాక్​ని అడిగితే మాత్రం తన గుండె కుడి వైపు ఉందని తడుముకోకుండా చెప్పేస్తుంది. దీనికి కారణమేంటో మీరే చదివేయండి మరి..

hearrt at right side
ఆమె గుండె కుడివైపున ఉంది!
author img

By

Published : Jul 22, 2021, 7:18 AM IST

Updated : Jul 22, 2021, 7:41 AM IST

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అని ఓ సినీ కవి అన్నారు. అయితే, ఓ యువతికి మాత్రం ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉందట. పుట్టిన 19 ఏళ్ల తర్వాత ఈ విషయం తెలిసినప్పటినుంచి ఆమె షాక్​లోనే ఉంది. అమెరికాలోని చికాగోకు చెందిన క్లెయిర్‌ మాక్‌ గత రెండు నెలలుగా దగ్గుతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. గత నెలలోనే ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్లు గుర్తించాడు.

hearrt at right side
గుండె కుడివైపు ఉందని తనకు అప్పుడే తెలిసిందని చెబుతున్నక్లెయిర్ మాక్

అయితే.. చికిత్సలో భాగంగా ముందుగా ఎక్స్‌ రే తీయాలని నిర్ణయించారు. అలా తీసిన ఎక్స్‌ రేతో గుండె కుడివైపు ఉన్న విషయం బయటపడింది. ఇదే విషయాన్ని క్లెయిర్‌కు చెప్పడం ఆమె విస్మయానికి గురైంది. ఇలా గుండె ఎడమవైపునకు కాకుండా కుడివైపు ఉంటే డెక్స్‌ట్రాకార్డియా అంటారని, ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువ మందిలో ఇలా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని క్లెయిర్‌ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లలో కొందరు ఆమెపై జోకులు వేస్తుంటే.. మరికొందరు జాగ్రత్తగా ఉండండని సూచనలు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 22, 2021, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.