అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తూర్పు లాస్‌ఏంజెల్స్ ప్రాంతంలో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నికీలల్లో చిక్కుకుని అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
లాస్‌ఏంజెల్స్‌కు 75 మైళ్ల దూరంలోని శాన్ బెర్నాడినో నేషనల్ ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అటవీ విభాగం వెల్లడించింది. అతని అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అటు మొజావే ప్రాంతంలో చెలరేగిన మంటల్లో అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి.
ఇదీ చూడండి: అమెరికా బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు: చైనా