ETV Bharat / international

లాక్​డౌన్​ ఎత్తేస్తే మళ్లీ ఆనాటి మరణ పరిస్థితులే! - Lockdown news america

అమెరికాలో లాక్​డౌన్​ను ఎత్తివేస్తే మళ్లీ కేసులు, మరణాలు పెరిగి పూర్వ పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచి. దశల వారీగానే ఆంక్షలను సడలించాలని పేర్కొన్నారు.

Dr Anthony Fauci
లాక్​డౌన్​ ఎత్తేస్తే మళ్లీ ఆనాటి మరణ పరిస్థితులే..!
author img

By

Published : May 12, 2020, 7:24 PM IST

అమెరికాలో లాక్​డౌన్​ను ఎత్తివేస్తే భారీ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడతారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచి. సెనేట్​లోని ప్యానెల్​కు ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. లాక్​డౌన్​ను ఎత్తివేస్తూ కొన్ని రాష్ట్రాలు ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులివ్వడాన్ని ట్రంప్​ ప్రశంసించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు ఫౌచి.

America top infectious disease expert Dr Anthony Fauci, is warning Congress that if the country reopens it will result in needless suffering and death
కొవిడ్‌-19 కట్టడి కోసం ఏర్పాటు చేసిన కార్యదళంలో కీలక సభ్యుడు ఫౌచి

పాజిటివ్​ కేసుల ఆధారంగా దశలవారీగా లాక్​డౌన్​ను ఎత్తివేయాలని సూచించారు ఫౌచి. రెండు వారాలుగా కేసుల తీవ్రతను అంచనా వేస్తూ.. కాంటాక్ట్​ ట్రేసింగ్​, నిఘా వ్యవస్థ ఆధారంగా వైరస్​ అనుమానితులను గుర్తించాలని చెప్పారు. నర్సింగ్​ హోమ్​లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి సత్వర వైద్య సేవలు అందించాలని కోరారు.

కరోనా నియంత్రణకు రూపొందించిన మార్గదర్శకాలను సరిగ్గా పాటించకపోతే దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరింత పెరుగుతాయని హెచ్చరించారు ఫౌచి. మరణాలు పెరిగితే సాధారణ పరిస్థితికి రాకుండా మరింత దుర్భరంగా మారుతుందని చెప్పారు.

అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 1,387,407 కేసులు నమోదు కాగా... 81,909 మంది చనిపోయారు. కరోనా ఆంక్షల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. 3 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.