అమెరికా స్కాట్స్బోరోలోని తెనెస్సీ నదీతీరంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డాక్ యార్డులో మంటలు చెలరేగి ఎనిమిది మంది అగ్నికి ఆహుతైపోయారు. దాదాపు 35 పడవలకు వ్యాపించిన మంటల్లో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ ప్రస్తుతం ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు.
ప్రాణభయంతో దూకేశారు...
ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నికీలల నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు నదిలోకి దూకారని స్కాట్స్బోరో అగ్నిమాపక సిబ్బంది ప్రధానాధికారి జీనే నెక్లాస్ తెలిపారు. వీరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అలాగే ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారో స్పష్టత లేనందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రకటించారు.
15-20నిమిషాల్లోనే...
మంటలు చెలరేగిన 15-20 నిమిషాల్లోనే రేవు సమీప ప్రాంతమంతా అగ్నిజ్వాలల్లో చిక్కుకుపోయిందని.. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న మాండీ దుర్హమ్ అనే ప్రయాణికురాలు పేర్కొన్నారు. పడవల్లో ఉన్న ప్రొపేన్ వాయు ట్యాంకులే భారీ అగ్నిప్రమాదానికి కారణమయ్యాయని తెలిపారు.
ఇదీ చూడండి: వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!