ETV Bharat / international

అమెరికా ఎన్నికలకు ముందు ఆస్టరాయిడ్ ముప్పు - నాసా అమెరికా ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక్కరోజు ముందు భూమిని గ్రహశకలం ఢీకొట్టే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. 6.5 అడుగుల వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని అంచనా వేసింది.

A tiny asteroid may hit earth a day before US election
అమెరికా ఎన్నికలకు ముందు భూమికి ఆస్టరాయిడ్ ముప్పు!
author img

By

Published : Aug 24, 2020, 5:35 PM IST

అంతరిక్షంలో ఓ గ్రహశకలం(ఆస్టరాయిడ్) భూమి వైపు ప్రయాణిస్తోందని నాసా వెల్లడించింది. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనే అవకాశం 0.41 శాతం ఉందని అంచనా వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నవంబర్ 3కు ఒక్క రోజు ముందు ఇది భూమిని తాకొచ్చని అభిప్రాయపడింది.

ఈ ఆస్టరాయిడ్​ను 2018వీపీ1గా పేర్కొంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. దీని వ్యాసం ఆరున్నర అడుగులు ఉందని తెలిపారు.

కాలిఫోర్నియాలోని పాలోమర్ అబ్జర్వేటరీలో 2018 సంవత్సరంలో ఈ ఆస్టరాయిడ్​ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అబ్జర్వేటరీలో 12.968 రోజుల వ్యవధిలో 21 సార్లు పరిశీలించిన డేటా ఆధారంగా గ్రహశకలం ప్రభావం అంతగా ఉండదని నిర్ధరించారు.

ఇప్పటికే ఒకటి..

గత వారాంతంలో కారు సైజు ఉన్న ఓ గ్రహశకలం భూమికి సమీపానికి వచ్చి వెళ్లినట్లు నాసా వెల్లడించింది. దక్షిణ హిందూ సముద్రానికి 2,950 కిలోమీటర్ల పైనుంచి ఈ ఆస్టరాయిడ్ వెళ్లినట్లు ధ్రువీకరించింది.

ఇదీ చదవండి-భూమికి అత్యంత సమీపానికి వచ్చిన గ్రహశకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.