ETV Bharat / international

శిలువకు నిప్పు పెట్టి.. పారిపోయేందుకు స్పైడర్​మ్యాన్​లా ఫీట్లు! - లాస్​ ఏంజెల్స్​ చర్చి

అమెరికాలో ఓ చర్చి టవర్​పైకి ఎక్కి.. శిలువకు నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఆపై పక్క భవనాలపై దూకుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పారిపోయేందుకు యత్నించిన దుండగుడిని చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు.

A man set a fire at the base of a cross
శిలువకు నిప్పు
author img

By

Published : Jul 9, 2021, 10:39 AM IST

Updated : Jul 9, 2021, 11:35 AM IST

శిలువకు నిప్పు పెట్టి.. పారిపోయేందుకు స్పైడర్​మ్యాన్​లా ఫీట్లు

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓ చర్చి టవర్​పై ఉన్న శిలువ అడుగున నిప్పంటించాడు ఓ దుండగుడు. తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పక్క భవనాలు, ఇళ్లపై దూకుతూ, కేబుల్​ వైర్లు పట్టుకుని స్పైడర్​మ్యాన్​లా వేలాడుతూ.. పోలీసులకు చుక్కలు చూపించాడు.

A man set a fire at the base of a cross
నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ఏమైందంటే..?

ఒంటిపై కేవలం చెడ్డీ, ఒక సాక్సు ధరించిన దుండగుడు.. లాస్​ ఏంజల్స్​లోని సెయింట్​ మేరీ​ చెందిన 130 అడుగుల ఎత్తైన రోమన్​ కేథలిక్​ చర్చి టవర్​పైకి ఎక్కి.. శిలువను పడగొట్టడానికి విఫయత్నం చేశాడు. ఆ తర్వాత శిలువ అడుగున నిప్పంటించాడు. అయితే మంటలు అదుపులోనే ఉండటం వల్ల ప్రమాదం తప్పింది.

A man set a fire at the base of a cross
తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితుడు
A man set a fire at the base of a cross
కేబుల్​ వైర్ల సాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితుడు

నిందితుడు.. చర్చిపై నుంచి పక్కనే ఉన్న భవనాలపైకి దూకి.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కేబుల్​​ వైర్లను ఉపయోగించుకుని పక్క భవనంపైకి దూకాడు. అప్పటికే భవనాల చుట్టూ.. ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకలా చేశాడన్న విషయం తెలియరాలేదు.

ఇదీ చూడండి: 'స్పెల్లింగ్​ బీ' విజేతగా జైలా అవంత్​

Last Updated : Jul 9, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.