భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా జీఎస్పీని పునరుద్ధరించాలని అమెరికన్ చట్టసభలకు చెందిన 44 మంది ప్రతినిధులు ట్రంప్ పాలకవర్గాన్ని కోరారు. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్హైజర్కు లేఖను అందజేశారు.
భారత్‌తో తదుపరి జరపాల్సిన చర్చల్లో జాప్యం ద్వారా అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై 26 మంది డెమొక్రాట్లు,18 మంది రిపబ్లికన్లు సంతకాలు చేశారు.
'సుంకాలు వడ్డిస్తున్నా ... పెరిగిన దిగుమతులు'
భారత్‌ను గత జూన్‌లోనే జీఎస్పీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది అమెరికా. ఈ నిర్ణయంతో ఆర్థికంగానేగాక, ఉద్యోగాల విషయంలోనూ అమెరికా నష్టపోతోందని ప్రతినిధులు చెబుతున్నారు. జీఎస్పీ హోదా తొలగింపుతో అధిక సుంకాలు వేసినప్పటికీ జూన్, జులైల్లో భారత్ నుంచి 40 శాతం దిగుమతులు పెరిగినట్లు వెల్లడించారు.
పెరిగిన సుంకాల కారణంగా అమెరికన్ వ్యాపారవేత్తలు ఒక మిలియన్ డాలర్ల మేర భారత ఎగుమతిదారులకు బిల్లులు బకాయి పడ్డారన్నారు. కేవలం ఒక జులైలోనే 30 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చిందన్న ప్రతినిధులు... భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు చేయడం ద్వారా అమెరికా భారీగానే నష్టపోతోందన్నారు.