ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం -నలుగురు మృతి - అమెరికాలో కాల్పుల కలకలం -నలుగురు మృతి

అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు అగ్రరాజ్యంలోని నెవెడా రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

4 killed in Nevada shooting
అమెరికాలో కాల్పుల కలకలం -నలుగురు మృతి
author img

By

Published : Nov 4, 2020, 3:38 PM IST

అమెరికా నెవెడా రాష్ట్రం హెండర్​సన్​ ప్రాంతంలో మంగళవారం కాల్పులు జరిగాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించారని అధికారులు పేర్కొన్నారు. లాస్​ వేగాస్​ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

గాయపడిన ఐదుగురి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. వీరిలో ఒకరిని నిందితుడుగా భావిస్తున్నామని తెలిపారు. ఇద్దరు క్షతగాత్రులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.