అమెరికాలో కాల్పుల కల్లోలం ఆగడం లేదు. ఆదివారం ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల జరుగుతున్న వేళ.. మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డాలస్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితులను ఇంకా గుర్తించలేదని చెప్పారు. దీనిపై తాము దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. కాల్పుల సమాచారం అందుకోగానే అక్కడికి చేరుకున్న తాము ఐదుగురిని ఆస్పత్రి తరలించామని చెప్పారు. వారిలో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పాయారని వివరించారు.
ఘటనాస్థలిలో పోలీసులు మార్కింగ్‌ను వేశారని, రహదారి మధ్యలో ఉన్న ఓ వాహనం బుల్లెట్ రంధ్రాలతో కనిపించిందని స్థానిక మీడియా తెలిపింది. కుటుంబ సభ్యులను గుర్తించేవరకు మృతుల పేర్లను వెల్లడించబోమని అధికారులు తెలిపారు.
ఫోర్ట్వార్త్ ప్రాంతంలో..
ఆదివారం ఉదయం కూడా ఫోర్ట్వార్త్ ప్రాంతంలో కాల్పలు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. గుంపులుగా ఉన్న ప్రజలపైకి ఓ దుండగుడు కాల్పులు జరిపారని అక్కడి పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి: గోల్ఫ్ కోర్టులో కాల్పులు- ముగ్గురు మృతి
ఇదీ చూడండి: సైనిక విమాన ప్రమాదంలో 50కి చేరిన మృతులు