అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలో కల్తీ కొకైన్ తీసుకుని 12 మంది మృతి చెందారు. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అప్రమత్తమైన పోలీసులు.. మరింత ప్రాణనష్టం జరగకుండా పలు ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే మాదకద్రవ్యాలను కల్తీ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.