అమెరికాలోని మినియాపొలిస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ ఆందోళనల్లో హింస చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు.
ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో పోలీసులు ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ఘటన జరిగిన మినియాపొలిస్‌లోని అప్‌టౌన్ థియేటర్ ప్రాంతం వైపు ప్రజలెవ్వరూ రావద్దని పోలీసులు సూచించారు.
సూపర్ మార్కెట్, థియేటర్ వద్ద కాల్పులు జరిగినట్లు కనిపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో క్షతగాత్రుల ఆర్తనాదాలు, రక్తపు మరకలు స్పష్టంగా కన్పించాయి. ఘటనకు సంబంధించి పోలీసులను మరింత సమాచారం అడిగితే ఎలాంటి స్పందన లేదని స్థానికులు తెలిపారు.