ETV Bharat / international

127 ఏళ్లు జీవించిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి!

author img

By

Published : Oct 2, 2021, 7:37 AM IST

ప్రపంచంలోనే అత్యధికకాలం జీవించిన వ్యక్తిగా(Oldest Person In The World).. 'నటాబే తిన్స్యూ' పేరు గిన్నిస్​ బుక్​లో నమోదు కానున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం మరణించిన నటాబే.. 1894లో జన్మించాడంటూ ఆయన మనవడు అధికారిక ధ్రువపత్రాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులకు అందించాడు.

oldest person in world
గిన్నిస్ రికార్డు

ప్రపంచంలోనే అత్యధికకాలం జీవించిన వ్యక్తిగా(Oldest Person In The World) ఆఫ్రికాలోని ఎరిత్రియాకు చెందిన నటాబే తిన్స్యూ చరిత్ర సృష్టించబోతున్నారు. కాకపోతే, చనిపోయిన తర్వాత! ఇప్పటివరకూ ఈ రికార్డు(Oldest Person In The World) జపాన్‌కు చెందిన జిరోమోన్‌ కిమురా(116) పేరున ఉంది. అయితే, నటాబే 127 ఏళ్ల వయసులో గత సోమవారం కాలం చేశారు.

Oldest Person In The World
నటాబే తిన్స్యూ

నటాబే వయసుకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తన తాత 1894లో జన్మించాడంటూ నటాబే మనవడు జీర్‌ అధికారిక ధ్రువపత్రాన్ని కూడా అందించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను గిన్నిస్‌ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. పశువుల కాపరిగా పనిచేసిన నటాబే 1934లో వివాహం చేసుకున్నారు. ఆయన భార్య కూడా ఎక్కువ కాలమే జీవించింది. 99 ఏళ్ల వయసులో ఆమె 2019లో మృతిచెందింది.

వృద్ధ కవలలుగా గిన్నిస్​లో చోటు..

మరోవైపు... ఇటీవలే అత్యంత పెద్దవయస్సు గల కవలలుగా (Oldest Twins in the World) జపాన్‌కు చెందిన ఇద్దరు వృద్ధులు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నారు. ఉమేనో సుమియామ, కౌమె కొదమా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Oldest Twin Sisters) 107 సంవత్సరాల 330 రోజుల వయస్సుతో రికార్డు సృష్టించినట్లు గిన్నిస్‌ బుక్‌ తెలిపింది.

పశ్చిమ జపాన్‌లోని షోడోషిమా దీవిలో 1913 నవంబర్‌ 5న వీరిద్దరు జన్మించారు. సెప్టెంబరు 1నాటికి వీరి వయసు ఇంతకు ముందు ఉన్న రికార్డును అధిగమించినట్లు గిన్నిస్ సంస్థ వెల్లడించింది. జపాన్‌లో జాతీయ వృద్ధాప్య దినోత్సవం రోజున ఈ ప్రకటన చేశారు. (Oldest Twins in Japan) కరోనా కారణంగా వారి ధ్రువపత్రాలను మెయిల్‌లో అందించగా... గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కడంపై వృద్ధ కవలలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: వయసు వందేళ్లు- పవర్​లిఫ్టింగ్​లో గిన్నిస్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.