మొజాంబిక్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 32 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రాజధాని మపుటోలోని మనికా జిల్లాలో అతివేగంగా వెళుతున్న బస్సు కార్లను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.
బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడం, అడ్డదిడ్డంగా ఓవర్ టేక్ చేస్తూ వాహనాన్ని అదుపు చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అక్కడి మీడియా వెల్లడించింది. దీంతో రహదారి మొత్తం రక్తసిక్తంగా మారింది.
రెండేళ్ల చిన్నారి సహా 31 మంది ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోగా, ఓ మహిళ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మపుటో గవర్నర్ సహా పోలీస్ కమాండర్ జనరల్ బెర్నార్డినో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇదివరకే ఓ సారి నిషేధానికి గురైన బస్సు యాజమాన్య సంస్థ నకాలేను బ్యాన్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: కూలిన సైనిక విమానం- 45కు చేరిన మృతులు