నైజీరియాలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు భారతీయ నావికులను సముద్రపు దొంగలు అపహరించారు. భారతీయులు ప్రయాణిస్తున్న 'ఎంటీ అపెకస్' ఓడనూ వారి అధీనంలోకి తీసుకున్నట్టు సమాచారం.
రెండు వారాలుగా ఆచూకీ లేకుండాపోయిన ఐదుగురు నావికులు అపహరణకు గురయినట్టు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. అపహరణ విషయాన్ని నైజీరియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భారత దౌత్యవేత్త అభయ్ ఠాకూర్‌ను ఆదేశించారు. భారత్‌లోని నైజీరియా హైకమిషనర్కూ సమాచారం అందించారు సుష్మ.
-
I have seen news reports about abduction of five Indian sailors by pirates in Nigeria. I am asking Indian High Commissioner to take this up at the highest level with Government of Nigeria for their release.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Abhay - Please take this up and send me a report. @india_nigeria
">I have seen news reports about abduction of five Indian sailors by pirates in Nigeria. I am asking Indian High Commissioner to take this up at the highest level with Government of Nigeria for their release.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 7, 2019
Abhay - Please take this up and send me a report. @india_nigeriaI have seen news reports about abduction of five Indian sailors by pirates in Nigeria. I am asking Indian High Commissioner to take this up at the highest level with Government of Nigeria for their release.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 7, 2019
Abhay - Please take this up and send me a report. @india_nigeria
రెండు వారాల క్రితమే..
రెండు వారాల క్రితమే నావికుల ఆచూకీ గల్లంతైందని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అపహరణకు గురైన నావికుడు సందీకుమార్ చౌదరి భార్య భాగ్యశ్రీ దాస్.. సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్ ద్వారా అపహరణ విషయాన్ని తెలిపారు.
ఈ వ్యవహారంపై నైజీరియా నావికాదళం, పోలీసులతో పది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: హెలికాప్టర్ కూలి ఏడుగురు జవాన్లు మృతి