నైజీరియాలో 1500 మంది ఖైదీలున్న ఒక జైలుపై సాయుధ దుండగులు దాడి చేశారు. భారీగా ఆయుధాలు ధరించిన వీరు.. పక్కనే ఉన్న పోలీసు, సైనిక, ప్రభుత్వ భవనాలపైనా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఖైదీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. ఇమో రాష్ట్రంలోని ఒవెరీ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
ముష్కరులు ఒక ప్రణాళిక ప్రకారం ఏకకాలంలో ఈ భవనాలపై దాడి చేశారు. రెండు గంటల పాటు ఇది కొనసాగింది. ఈ దాడిని తాము తిప్పికొట్టినట్లు భద్రతా దళాలు తెలిపాయి. దుండగుల వద్ద మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు, మెరుగుపరచిన పేలుడు పదార్థాలు ఉన్నాయని వివరించాయి. 'ఈస్ట్రన్ సెక్యూరిటీ నెట్వర్క్' అనే తీవ్రవాద ముఠా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: మరో రెండు సార్లు అధ్యక్షుడిగా పుతిన్!