మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్ తెదేపా అభ్యర్థి సుర్ణం రాజేశ్ గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.
డివిజన్లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని తెలిపారు. తనను గెలిపిస్తే మల్లాపూర్ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'పోలింగ్ ముగిసేవరకు మద్యం దుకాణాలు మూసివేయండి'