ETV Bharat / entertainment

Bigg Boss 7 Telugu 8th Week Elimination : బిగ్​బాస్ ఓటింగ్ తారుమారు.. ఈవారం "అతిపెద్ద చేప" ఎలిమినేట్..! - బిగ్​ బాస్ 7 తెలుగు 8 వారం ఎలిమినేషన్

Bigg Boss 7 Telugu 8th Week Elimination : బిగ్​బాస్ 7వ సీజన్.. ఎనిమిదో వారానికి చేరింది. ఇప్పటి వరకు హౌజ్​ నుంచి ఏడుగురు వెళ్లిపోయారు. ఇప్పుడు ఎనిమిదో వారం ఎలిమినేషన్​ కోసం రంగం సిద్ధమైంది. మొత్తం ఎనిమిది మంది ఈవారం నామినేట్​ కాగా.. రోజురోజుకూ మారుతున్న ఓటింగ్​తో ఎవరు హౌస్​ నుంచి వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 7 Telugu 8th Week Elimination
Bigg Boss 7 Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 4:18 PM IST

Bigg Boss 7 Telugu 8th Week Elimination Analysis : తెలుగు బుల్లితెరపై పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్​బాస్ 7వ సీజన్.. ఎనిమిదో వారంలోకి ప్రవేశించింది. 14 మంది కంటిస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్​.. ఫస్ట్ వీక్ నుంచే ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఏడు వారాలు ఎలిమినేషన్స్ జరగ్గా.. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజామూర్తి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటి బాట పట్టారు.

Bigg Boss Telugu 7 Season Latest Update : ప్రస్తుతం బిగ్​బాస్ తెలుగు సీజన్ 7(Bigg Boss Telugu Season 7)లో ఒకవైపు నాలుగో కెప్టెన్సీ కోసం టాస్క్ నడుస్తుండగా.. మరోవైపు ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా యమా రంజుగా సాగుతోంది. అయితే.. 8వ వారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, భోలే షావలి, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, సందీప్, అశ్విని శ్రీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు.

తారుమారైన ఓటింగ్.. టాప్​లో ఎవరు ఉన్నారంటే..

Bigg Boss 7 Telugu 8th Week Voting Results : ఎనిమిదో వారం నామినేషన్లలో ఉన్న 8మందికి సోమవారం నుంచి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. తాజా ఓటింగ్ ప్రకారం చూస్తే.. హీరో శివాజీ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక ఊహించని రీతిలో ఓట్లు సంపాదించుకుని సింగర్ భోలే రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అమర్ దీప్ చౌదరి మూడో స్థానానికి పడిపోయాడు. అదేవిధంగా అశ్విని అనూహ్యమైన రీతిలో ఓట్లు పొంది.. నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ఐదో స్థానంలో గౌతమ్, ఆరో స్థానంలో ప్రియాంక జైన్ ఉన్నారు.

Bigg Boss Contestant Varthur Santhosh Arrested : బిగ్​బాస్​ హౌస్​​లోకి ఫారెస్ట్​ ఆఫీసర్స్.. కంటెస్టెంట్ అరెస్ట్​.. ఇదే కారణం

ఆ ఇద్దరూ డేంజర్​ జోన్​లో.. ఇక ఏడు, ఎనిమిది స్థానాల్లో అత్యంత తక్కువ ఓటింగ్​తో ఆట సందీప్, కార్తీక దీపం మోనిత శోభా శెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అటుపోతే ఈ వారం శోభాశెట్టి బిహేవియర్, మాటలు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయనే చర్చ సాగుతోంది. అందుకే.. ఆమెకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని నెటిజన్లు భావిస్తున్నారు. ఆరో వారమే ఈ అమ్మడు ఎలిమినేట్ కావాల్సింది. కానీ, బిగ్ బాస్ టీమ్ ఆమెను సేవ్ చేసేందుకు బాగా ఆడిన నయని పావనిని బలి చేసిందనే చర్చ కూడా సాగింది. ఇక ఈ వారం కూడా శోభా శెట్టి డేంజర్​ జోన్​లో ఉంది.

అదే జరిగితే పెద్ద చేప ఎలిమినేట్.. ఎనిమిదో వారం ఎలిమినేషన్​పై జనాలు ఆసక్తి ఉన్నారు. ఒకవేళ అనుకున్నట్టుగా చివరిస్థానంలో ఉన్న శోభా శెట్టి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయితే.. గతవారం శివాజీ అన్నట్లు పెద్ద చేప ఎలిమినేట్ అయినట్లే. పెద్ద చేపను పంపాలనుకుంటే.. సీరియల్ బ్యాచ్‌లో శోభా శెట్టి, ప్రియాంక, సందీప్ అనే ముగ్గురి కంటిస్టెంట్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావొచ్చు అని శివాజీ అన్నాడు. ఈ ముగ్గురిలో శోభా కంటే ప్రియాంక, సందీప్ ముందంజలో ఉన్నారు. దీంతో.. ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

Bhagavanth kesari Rathika Rose : 'భగవంత్​ కేసరి'లో బిగ్​ బాస్​ బ్యూటీ రతికా రోజ్​.. ఆ పాత్ర చేసిందట!

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.