ETV Bharat / entertainment

Alia Bhatt Citizenship: ఆలియా భట్​ది భారత్​ కాదట- ఏ దేశమో తెలుసా? - alia bhatt mother country

Alia Bhatt Citizenship: రణ్‌బీర్‌ కపూర్​ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆలియా భట్​ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. భారత్​లో​ నివసిస్తూ.. బాలీవుడ్​ సినిమాలు చేస్తున్న హీరోయిన్​ ఆలియా భట్​ది ఇండియా కాదట. అలా అయితే మరి ఈ సొట్ట బుగ్గల సుందరిది ఏ దేశం?

alia-bhatt
ఆలియా భట్​
author img

By

Published : Apr 16, 2022, 5:55 PM IST

Updated : Apr 16, 2022, 10:44 PM IST

Alia Bhatt Citizenship: బాలీవుడ్​ రొమాంటిక్​ హీరో రణ్‌బీర్‌ కపూర్​ను పెళ్లి చేసుకున్న ఆలియా.. పెళ్లి అనుభూతులను అస్వాదిస్తోంది. వివాహం జరిగిన నాటి నుంచి రణ్‌బీర్‌- ఆలియా ఫొటోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆలియాకు సంబంధించిన ఓ విషయంపై చర్చ జరుగుతోంది. ఆలియాభట్​ భారతీయురాలు కాదని కొందరు సోషల్​ మీడియాలో చర్చకు తెరదీశారు. అయితే ఇందులో నిజమెంత?

బాలీవుడ్​లో ప్రస్తుతం ఆలియా భట్​ హవా నడుస్తోంది. భారీ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఆర్​ఆర్​ఆర్​లో సీత పాత్రలో అలరించిన ఆమె.. త్వరలో తన భర్త రణ్​బీర్​తో కలిసి నటింటిన 'బ్రహ్మాస్త్ర' పార్ట్​-1తో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రముఖ దర్శకుడు మహేశ్‌ భట్‌ కూతురే ఆలియా. మహేశ్‌ భట్‌ భారతీయుడు అయినప్పుడు ఆయన కూతురు అయిన ఆలియా ఈ దేశ పౌరురాలు ఎందుకు కాదు..? అనేది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. అలాగే ఆలియాకు ముంబయిలోని పోష్‌ ఏరియా జుహూలో సొంత ఇల్లు కూడా ఉంది.

ఆలియా తల్లి సోనీ రజ్దాన్‌ బ్రిటన్​ పౌరురాలు. బ్రిటీష్​ నటి అయిన రజ్దాన్​ను మహేశ్​ భట్​ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో తల్లి నుంచి ఆమెకు బ్రిటీష్‌ పౌరసత్వం వచ్చింది. అది అలాగే కొనసాగుతూ.. వచ్చింది. ఆమె బ్రిటన్​ పౌరసత్వాన్ని ఎప్పుడూ వదులుకునే ప్రయత్నం చేయలేదు. భారతీయ సిటిజెన్‌షిప్‌ కోసం దరఖాస్తు కూడా చేయలేదు.

ఇదీ చదవండి: 'ఏం చరణ్​.. నన్ను డామినేట్​ చేస్తావా? నీ బాబును రా నేను'

Last Updated : Apr 16, 2022, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.