ETV Bharat / entertainment

Warner Alluarjun : వార్నర్​కు అల్లు అర్జున్​ స్పెషల్ మెసేజ్​.. ఇప్పుడిదే ట్రెండింగ్​! - David warner alluarjun reels

Warner Alluarjun : ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ వార్నర్​కు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ ఓ స్పెషల్ మెసేజ్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది.

Warner Alluarjun : వార్నర్​కు అల్లు అర్జున్​ స్పెషల్ మెసేజ్​.. ఇప్పుడిదే ట్రెండింగ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 4:21 PM IST

Updated : Oct 28, 2023, 8:43 AM IST

Warner Alluarjun : ప్రస్తుతం వరల్డ్ కప్ 2023లో డేవిడ్ వార్నర్ ఆడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా పాకిస్థాన్​, నెదర్లాండ్స్​పై మెరుపు సెంచరీలు కూడా బాదాడు. అయితే వార్నర్​ అంటే ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి, క్రికెట్ అభిమానికి ఎంతో ఇష్టం. ఎందుకంటే అతడు తన ఆటతో పాటు టాలీవుడ్​ హీరోలకు చెందిన ఎన్నో సాంగ్స్​ను రీల్స్​గా చేసి ఆకట్టుకున్నాడు. అలాగే ఐపీఎల్​లోనూ సన్​రైజర్స్​ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసి అదరగొట్టాడు.

నేడు అతడి పుట్టిన రోజు(Warner Birthday Wishes) సందర్భంగా చాలా మంది బర్త్​డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ కూడా.. "క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చాడు.

ఇకపోతే డేవిడ్ వార్నర్, అల్లు అర్జున్ మధ్య ప్రత్యేక బంధం ఉందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా వీళ్లు అప్పుడప్పుడు చాట్ చేసుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ పుట్టినరోజు.. వార్నర్​ కూడా విషెస్ తెలిపాడు. అది కూడా పుష్ప స్టైల్లో చెప్పడం విశేషం. తన కూతురు ఐస్లా ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ అని కూడా అప్పుడు చెప్పాడు. ఇక ఐపీఎల్​లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే సమయంలో తెలుగు సినిమాలు, ఇక్కడి స్టార్లను వార్నర్​ ఎక్కువుగా అనుకరించేవాడు వార్నర్​. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప, అలవైకుంఠపురములో వంటివి చేశాడు. అవి నెటిజన్లను బాగా అలరించాయి.

Puhspa 2 Shooting : ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్​.. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 15న(Puhspa 2 Release Date) గ్రాండ్​గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్​గా బన్నీ బెస్ట్​ యాక్టర్​గా నేషనల్ అవార్డ్​ను కూడా అందుకున్నారు.

Aus vs Ned World Cup 2023 : 'వార్నర్' మెరుపులు.. 'మ్యాక్స్​వెల్' ఊచకోత.. ప్రపంచకప్​లోనే ఫాస్టెస్ట్ సెంచరీ

Warner On Allu Arjun : 'పుష్ప'కు వార్నర్ విషెస్.. వెల్​డన్​ అంటూ..

Last Updated : Oct 28, 2023, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.