ETV Bharat / entertainment

గెట్​ రెడీ ఫ్యాన్స్​.. వచ్చే వారమే ఓటీటీలో బిగ్​ స్టార్స్​ మూవీస్​

author img

By

Published : Feb 18, 2023, 5:44 PM IST

టాలీవుడ్​ అగ్రతారల సినిమాలన్నీ ఒక్కోకటిగా ఓటీటీలో రిలీజయ్యేందుకు క్యూ కడుతున్నాయి. అలా సంక్రాంతి బరిలోకి వచ్చి సక్సెస్​ కొట్టిన బడా సినిమాలు త్వరలోనే ఆన్​లైన్​లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు..

Etv Bharat
గెట్​ రెడీ ఫ్యాన్స్​.. వచ్చే వారమే ఓటీటీలో బిగ్​ స్టార్స్​ మూవీస్​

టాలీవుడ్​లో విడుదలైన పలు అగ్రతారల సినిమాలు త్వరలో ఓటీటీలో సందడి చేయనున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమాలు వరుసపెట్టి ఓటీటీ బాట పట్టనున్నాయి. జనవరిలో రిలీజైన వారసుడు,వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యలు ఆన్​లైన్​లో స్ట్రీమ్​ కానన్నాయి. ఇంతకీ ఈ సినిమాలు ఓటీటీలో ఎప్పుడు రిలీజవ్వనున్నాయంటే..

'వీర‌సింహారెడ్డి' సినిమాతో సంక్రాంతి బరిలో తన జోరు చూపించారు నట సింహం నందమూరి బాలకృష్ణ. జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టింది. థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పడు ఓటీటీలో సందడి చేయనుంది. కాగా ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను రిలీజ్‌కు ముందే డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్ దాదాపు రూ.15 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 23 సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ట్విట్టర్​ వేదికగా డిస్నీ సంస్థ ప్ర‌క‌టించింది. దీంతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక స్ట్రీమింగ్​ కోసం వెయిట్​ చేస్తున్నారు.

బాల‌కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థియేటర్లో అయితే ఇక జనాలు జై బాలయ్య అంటూ కేరింతలు కొట్టారు. కాగా, అన్నా చెల్లెళ్ల ప‌గ‌, ప్ర‌తీకారాల‌ నేపథ్యంతో రాయలసీమ స్టైల్​లో తీసిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ బాక్సాఫీస్​ను షేక్​ చేసింది. ఈ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతిహాస‌న్, హ‌నీ రోజ్ న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించారు.

మెగస్టార్​ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్​ కానుంది. అన్నా తమ్ముళ్ల సెంటిమెంట్​ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు తమ్ముడిగా మాస్​ మహారాజ్​ రవితేజ నటించారు. థియేటర్​లో రచ్చ రచ్చ చేసిన ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​ వేదికగా ఫిబ్రవరి 27నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ మాస్​ ఎంటర్టైనర్​లో మెగస్టార్​ సరసన శ్రుతిహాసన్ నటించారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​పై నవీన్​ యర్నేని, వై రవిశంకర్​ సంయుక్తంగా తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్​ సంగీతాన్ని సమకూర్చారు.

సంక్రాంతి బరిలో నిలిచిన మరో సినిమా వారసుడు. తమిళ హీరో విజయ్​ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా ఈ సినిమా కూడా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్​ వేదికగా ఫిబ్రవరి 22న ఈ మూవీ రిలీజవ్వనుంది. తెలుగులోనే కాకుండా అన్నీ సౌత్​ ఇండియన్​ లాంగ్వేజస్​లో ఈ సినిమా స్ట్రీమ్​ కానుంది. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 10న ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారట. అయితే అప్పటికే వారసుడు థియేటర్లలో రన్​ అవుతున్నందున ఆ డేట్​ను పోస్ట్​పోన్​ చేసి ఫిబ్రవరి 22కు ఫిక్స్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.