Vivaha Bhojanambu Brahmanandam : తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. 1200కు పైగా చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్‌లోనూ చోటు సంపాదించుకున్నారు. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారాయన. అయితే తాను ఓ సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందిని గుర్తుచేసుకున్నారాయన.
Suthi Veerabhadra Rao and Brahmanandam Comedy Scene : "వివాహభోజనంబు చిత్రంలో నాదీ సుత్తి వీరభద్రరావుగారిదీ ఓ సెపరేట్ ట్రాక్. మా ఇద్దరి మధ్య విశాఖపట్నం బీచ్‌లో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించారు. తలవరకూ నన్ను భూమిలో పాతిపెట్టి.. హైదరాబాదు... ఆదిలాబాదు.. సికిందరాబాదూ..' అంటూ మొత్తం ఇరవై ఒక్క బాదులతో సుత్తి వీరభద్రరావు నన్ను బాదేసే సీన్ అది. నేనేమో ఆ గోతిలోనే ఉండి డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాలి. సాధారణంగా ఇలాంటి సీన్స్‌లో చిన్న చిన్న ట్రిక్కులు ప్లే చేస్తారు. నిజంగా పాతిపెట్టకుండా.. ఓ చెక్క పెట్టెలో మమ్మల్ని నిలబెట్టి.. చుట్టూ మట్టి పోస్తారు. పేరుస్తారు. కానీ ఆరోజు మాత్రం నన్ను నిజంగానే పాతే పెట్టారు. సరిగ్గా ఆ సమయానికి ఓ కుక్క అటువైపుగా వచ్చింది. దాన్ని చూసి వెంటనే జంధ్యాల గారు 'ఏ ఊరకుక్కయినా దగ్గరకొచ్చి కాలెత్తితే పావనమైపోతుంది మహాప్రభో' అనే డైలాగ్ అప్పటికప్పుడు రాశారు.
ఆ సీన్ చూసి ఇప్పటికీ జనాలు నవ్వుకుంటుంటారు కానీ, ఆ రోజు నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కాళ్లూ, చేతులు కదపకుండా కేవలం ముఖ కవళికలే ప్రదర్శించడం అంత ఈజీ కాదు. పైగా.. మిట్టమధ్యాహ్నం ఎండ సుర్రుమంటుంది. నిజంగానే ముక్కు తెగ దురద పెట్టింది. నేనేమో గోక్కోలేను. ఎవరినైనా పిలిచి గోకండి అని అడగలేను. ఈ సీన్ ఎప్పుడైపోతుంది భగవంతుడా అనుకున్నాను. సన్నివేశం అవ్వగానే... నన్ను అలానే వదిలేసి అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. మహానుభావా.. నన్ను ఈ గోతులోంచి తీసేదేమైనా ఉందా అంటూ గట్టిగా అరిస్తే టీమ్‌లో ఎవరో ఒకరు వచ్చి నన్ను బయటకు లాగారు. ఈ విషయం ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తుంటుంది" అంటూ అప్పటి సంగతులను చెప్పారు బ్రహ్మీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Tillu Square Release Date : 'టిల్లు స్వ్కేర్' వచ్చేస్తున్నాడు.. కొత్త రిలీజ్ డేట్ ఇదే