ETV Bharat / entertainment

ఆరో ఏడాదిలోకి 'విరుష్క' పెళ్లి బంధం- అనుష్కను కోహ్లీ ఎలా ఇంప్రెస్ చేశాడో తెలుసా? - వామిక కోహ్లీ విరుష్క

Virat Anushka Anniversary : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహ బంధం ఆరో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో విరాట్​ గురించి గతంలో అనుష్క శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం.

Virat Anushka Anniversary
Virat Anushka Anniversary
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 10:15 AM IST

Updated : Dec 11, 2023, 10:26 AM IST

Virat Anushka Anniversary : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ, బాలీవుడ్​ హీరోయిన్ అనుష్క శర్మ వివాహ బంధం ఆరో ఏడాదిలోకి అడుగు పెట్టింది. దీంతో ఈ జంట ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్​గా మారింది. అభిమానులు వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింల్లో తెగ షేర్ చేస్తున్నారు. విరుష్క అనే హ్యాష్​ట్యాక్​ను ట్రెండ్​ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విరాట్​ ఇంప్రెస్ చేశాడిలా!
విరాట్​తో డేటింగ్​కు ముందు తనను ఆకట్టుకున్న విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ వెల్లడించింది. విరాట్​ కోహ్లీ, అనుష్క పాల్గొన్న ఇంటర్వ్యూలో 'ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ముఖ్యమైన తేదీలను మరిచిపోతారు' అని హోస్ట్ అడిగారు. దీనికి సమాధానంగా విరాట్ స్పందించాడు. 'నా జ్ఞాపకశక్తి కొంచెం మెరుగ్గా ఉంది. ఆమె నాకు గుర్తుంచుకోవడానికి ముఖ్యమైన తేదీలను ఇస్తుంది. కాబట్టి నేను వాటిని గుర్తుంచుకోవడం మంచిది' అని చెప్పాడు. ఇంతలో అనుష్క కలగజేసుకుని 'మేము డేటింగ్ ప్రారంభించే ముందు విరాట్​లో నన్ను ఇంప్రెస్ చేసిన విషయం అతడి మెమొరీ. అప్పుడు నేను 'ఇస్​కీ మెమొరీ బహుత్​ అచ్చీ హై (అతడికి జ్ఞాపక శక్తి బాగా ఉంది)' అని అనుకున్నాను. అది నాకు చాలా ఉపయోగపడుతుంది' అని అనుష్క తెలిపింది.

Virat Kohli Marriage Date : పెళ్లికి ముందు ఎక్కడ చూసినా విరాట్‌-అనుష్క గురించే చర్చ జరిగింది. చాలా కాలం గోప్యత పాటించిన ఈ జంట కొన్నాళ్లపాటు ప్రేమించుకుని 2017 డిసెంబర్‌ 11న ఒక్కటయ్యారు. ఇటలీలోని టూస్కానీలో 800 ఏళ్ల నాటి వారసత్వ విల్లా వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి 2021 జనవరి 11న వామిక జన్మించింది. అయితే వీరు ప్రేమించుకునే సమయంలో కోహ్లీ ఏ దేశంలో మ్యాచ్‌లు ఆడినా అనుష్క కూడా అక్కడికే వెళ్లిపోయేది. 2020 ఐపీఎల్‌ యూఏఈ సీజన్‌ సమయంలోనూ దుబాయ్‌కు వెళ్లింది. మరోవైపు అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అనుష్క బేబీ బంప్ ఫొటోలు కూడా సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయం గురించి విరుష్క జంట స్పందించలేదు.

గల్లీ క్రికెటర్లకు మహత్తర అవకాశం- మార్చిలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్​ లీగ్, ప్లేయర్ల ఎంపిక అప్పుడే!

2023 బాక్సాఫీసు లెక్కలు- ఈ ఏడాది అగ్రతారల ఆధిపత్యమెంత?​

Last Updated : Dec 11, 2023, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.