Vijay Antony Tweet On His Daughter : హీరో విజయ్ ఆంటోనీ.. తన కుమార్తె ఆత్మహత్యపై స్పందించారు. ఈ క్రమంలో X(ట్విట్టర్) వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన కుమార్తెతో పాటే తాను చనిపోయానని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక నుంచి తాను చేసే ప్రతి మంచి పనిని ఆమె పేరునే చేస్తానని.. అలాగైనా ఆమెతో కలిసి ఉన్నట్లుగా భావిస్తానని ఆయన అన్నారు.
"నా పెద్ద కుమార్తె చాలా ధైర్యవంతురాలు. ఆమె దగ్గర దయాగుణం కూడా ఉంది. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం.. ఇవేవి లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి తను వెళ్లిపోయింది. తను ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. తనతో పాటే నేను కూడా చనిపోయాను. ఇక ఇప్పటినుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను."
-విజయ్ ఆంటోనీ, సినీ నటుడు
ఫ్యాన్స్ ధైర్యం..!
విజయ్ ఆంటోనీ పెట్టిన పోస్ట్ చూసిన ఆయన అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతున్నారు. 'ఆ దేవుడు మీకు మనోబలాన్ని ప్రసాదించాలి', 'ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలి', 'మంచి మనుషులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది', 'ధైర్యంగా ఉండండి' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఒత్తిడి కారణంగానే బలవన్మరణం..!
సెప్టెంబర్ 19(మంగళవారం) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె తన నివాసంలోని ఓ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయాన్నే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే విజయ్ ఆంటోనీ కుమార్తె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నారు.
- — vijayantony (@vijayantony) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— vijayantony (@vijayantony) September 21, 2023
">— vijayantony (@vijayantony) September 21, 2023
7 ఏళ్ల వయసులో తండ్రి కూడా..!
Vijay Antony Father : గతంలో విజయ్ ఓ ఈవెంట్లో తన గతం గురించి చెప్పుకొచ్చారు. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని.. అప్పుడు తన అమ్మ కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. సూసైడ్ మాత్రం చేసుకోవద్దంటూ చెప్పుకొచ్చారు.