ETV Bharat / entertainment

ఓటీటీలో వరుణ్‌-లావణ్య పెళ్లి వీడియో - టీమ్​ క్లారిటీ! - వరుణ్ తేజ్​ లావణ్య వెడ్డింగ్ వీడియోలు

Varun Lavanya Marriage Videos : మెగా ప్రిన్స్​ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహ వేడుకను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​పై ప్రసారం కానుందన్న వార్తలపై తాజాాగా వరుణ్​ టీమ్ స్పందించింది.

Varun Lavanya Marriage Videos
Varun Lavanya Marriage Videos
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 7:22 PM IST

Varun Lavanya Marriage Videos : టాలీవుడ్ స్టార్ హీరో, మెగా ప్రిన్స్​ వరుణ్‌ తేజ్ , లావణ్య త్రిపాఠి జంట తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇటలీలోని టస్కానీ వేదికగా నవంబర్‌1 న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అంగరంగవైభవంగా ఈ వేడుక జరగ్గా.. దీనికి సంబంధిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్​ అయ్యాయి. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

ఈ జంట పెళ్లి వీడియో.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుందంటూ న్యూస్​ వెలువడింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని నెట్టింట వైరల్​ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై వరుణ్‌ తేజ్ టీమ్ స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి రూమర్స్​ను క్రియేట్​ చేయొద్దని కోరింది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినప్పటికీ.. ఎప్పటికైనా పెళ్లి వీడియో గ్లింప్స్​ను వరుణ్​- లావణ్య తమ సోషల్​ మీడియాలో పోస్ట్ చేస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్పెషల్ అట్రాక్షన్​గా క్యాస్ట్యూమ్స్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన పెళ్లిలో క్రీమ్​ కలర్డ్​ గోల్డ్ షేర్వానీ ధరించారు. పెళ్లి కూతూరు లావణ్య త్రిపాఠి ప్రత్యేకంగా తయారు చేసిన ఎరుపు రంగు కాంచీపురం చీరలో కనిపించింది. ఈ ఇద్దరూ తమ డిజైనర్​ దుస్తులతో వేడుకకే స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. అయితే అంత అందంగా ఈ పెళ్లి కాస్ట్యూమ్స్​ను డిజైన్​ చేసింది మరెవరో కాదు.. ఫేమస్ వెడ్డింగ్ డిజైనర్ మనీశ్​ మల్హోత్రా. ఆయన దేశంలోని అనేక మంది సెలబ్రిటీల వివాహాలకు ఇప్పటివరకు ఎన్నో రకాల కాస్ట్యూమ్స్​ను డిజైన్​ చేశారు.

Varun Lavanya Reception : ఇక ఇటలీలో పెళ్లి వేడుకలకు రాలేకపోయిన బంధుమిత్రుల కోసం మెగా ఫ్యామిలీ హైదరాబాద్​లో గ్రాండ్​ రిసెప్షన్​ను ఏర్పాటు చేసింది. ఎన్​ కన్వెన్షన్​ వేదికగా నవంబర్‌ 5 జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలువురు హాజరై సందడి చేశారు. సుమ, రోషన్​, తేజా సజ్జా, నాగ చైతన్య, జయసుధ, వెంకటేశ్‌, జగపతిబాబు, మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌, దిల్‌రాజు, సుకుమార్‌, బోయపాటి శ్రీనివాస్‌, గుణశేఖర్‌ పలువురు సినీదర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

పెళ్లిలో మెగా కోడళ్ల సందడి - పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫొటో అంటే ఇదేనేమో మరి!

గ్రాండ్​గా వరుణ్​- లావణ్య రిసెప్షన్​, వేడుకలో ప్రముఖులు సందడి, ఫొటోలు చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.