ETV Bharat / entertainment

Trivikram pawankalyan : త్రివిక్రమ్​కు పవన్ కల్యాణ్ ఎదురెళ్లి పోటీపడతారా?

Pawankalyan Trivikram movies : ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ వర్సెస్ పవన్ కల్యాణ్​గా పరిస్థితి మారబోతుంది. ఆ వివరాలు..

Trivikram pawankalyan
Trivikram pawankalyan : త్రివిక్రమ్​కు పవన్ కల్యాణ్ ఎదురెళ్లి అడుకుంటారా?
author img

By

Published : Aug 3, 2023, 3:12 PM IST

Pawankalyan Trivikram movies : 'ఉస్తాద్​ భగత్ సింగ్' షూటింగ్ విషయంలో యూటర్న్​ తీసుకున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగుతుందని తెలిసినప్పటి నుంచి సోషల్​మీడియాలో 'గుంటూరు కారం' వర్సెస్ 'ఉస్తాద్ భగత సింగ్' అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్​ ఎవరో అని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో అభిమానుల మనసులో పలు ప్రశ్నలు కూడా మెదులుతున్నాయి. అదేంటంటే.. ప్రచారంలో ఉన్నట్టుగానే 'ఉస్తాద్'ను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్​ అయితే.. షూటింగ్​ను ఐదు నెలల్లోనే పూర్తి చేయాలి. అసలు ఇది సాధ్యమవుతుందా అని ఫ్యాన్స్​ తెగ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే బ్రో చిత్రాన్ని స్పీడు స్పీడుగా చిత్రీకరించి డివైడ్ టాక్ అందుకునేలా చేశారని, ఇప్పుడీ ఉస్తాద్​ సింగ్​ విషయంలోనూ ఇలానే చేస్తే వర్కౌట్ అవుతుందా అని తెగ ఆలోచిస్తున్నారు.

ఒకవేళ అనుకున్నట్టే ఉస్తాద్ భగత్ సింగ్.. సంక్రాంతికి వస్తే.. మహేశ్ బాబాకు 'గుంటూరు కారం'కు గట్టి పోటినిస్తుంది. అంటే 'మహేశ్ వర్సెస్ పవన్'తో పాటు 'త్రివిక్రమ్ వర్సెస్ పవన్' కూడా అవుతుందని అంతా అనుకుంటున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్​​ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​కు మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి ఇప్పటికే పలు చిత్రాలు కూడా చేశారు. రాజకీయాలకు సంబంధించి పవన్​ మాట్లాడే ప్రతి మాట వెనక త్రివిక్రమ్ వ్యూహం ఉంటుందనే ప్రచారం కూడా బలంగానే ఉంది! మరి అంతటి స్నేహ బంధం ఉన్న త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమాకు.. పవన 'ఉస్తాద్'​తో ఎదురెళ్తారా అనే ప్రశ్న కూడా సినీ ప్రియుల మదిలో మెదులుతోంది. ప్రస్తుతం అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.

tollywood Sankranthi movies 2024 : ఇకపోతే ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేశ్​ 'గుంటూరు కారం'తో పాటు మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈగల్', విభిన్న కథల దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హనుమాన్' కూడా ఇన్నాయి. వీటిలో సినీ ప్రియులు దాదాపుగా మొదటి ప్రాధాన్యత 'గుంటూరు కారం'కు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ చిత్రం తేడా కొడితేనో లేదంటే టికెట్లు దొరక్కపోతేనో ఇతర సినిమాలకు వెళ్తారు. అయితే 'గుంటూరు కారం' తేడా కొట్టినా.. పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేస్తుంది. కానీ 'ఉస్తాద్'​ వస్తే మాత్రం 'గుంటూరు కారం' కలెక్షన్ల లెక్కల్లో చాలా మార్పులే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్​.. త్రివిక్రమ్​ను దృష్టిలో పెట్టుకుని.. సంక్రాంతికి 'ఉస్తాద్'తో అభిమానుల ముందుకు వస్తారా లేదో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి :

'ఉస్తాద్' యూటర్న్​.. మహేశ్​ 'గుంటూరు కారం'తో పోటీకి రెడీ!

Jahnvi Kapoor : ఎన్టీఆర్ కోసం ఏడాది కాలంగా.. ఫీలింగ్స్ బయటపెట్టిన హీరోయిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.