ETV Bharat / entertainment

టాలీవుడ్​లో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య - kundanapu bomma sudheer varma died

టాలీవుడ్​ యువ నటుడు సుధీర్ వర్మ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డినట్లు సుధీర్​ కుటుంబసభ్యులు తెలిపారు.

Tollywood Yound hero Sudheer varma died
టాలీవుడ్​ యంగ్​ హీరో ఆత్మహత్య
author img

By

Published : Jan 23, 2023, 2:39 PM IST

Updated : Jan 23, 2023, 5:41 PM IST

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో సుధీర్‌వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 18న వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్​లో సుధీర్​.. విషం తాగారు. వెంటనే కొండాపూర్​లోని ఆస్పత్రికి ఆయనను తరలించారు. ఈ నెల 19 వరకు అక్కడే చికిత్స పొందారు. అయితే గత శుక్రవారం.. విశాఖ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున మరణించారు.

కాగా, రాఘవేంద్ర రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు సుధీర్​. ఇంకా సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ నటించారు. సుధీర్ మృతి విషయాన్ని కుందనపు బొమ్మ' సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్‌ కోమాకుల సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్‌ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. సుధీర్​ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

సుధాకర్​ ట్వీట్​

ఇదీ చూడండి: ఈ వారమే షారుక్​ 'పఠాన్'.. ఇంకా ఏఏ సినిమాలు సందడి చేయనున్నాయంటే?

Last Updated : Jan 23, 2023, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.