ETV Bharat / entertainment

ఈసారి లెక్క తప్పింది.. ఫిబ్రవరిలో నిరాశపర్చిన సినిమాలివే!

author img

By

Published : Feb 27, 2023, 7:25 AM IST

ఏడాది ఆంరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానయకులు పండగ సమయంలో సందడి చేశారు. 2023 తొలి నెలలో వచ్చిన సినిమాలు విజయం సాధించడం వల్ల.. ఫిబ్రవరిలో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ మలి నెలను సినీ వర్గాలు అన్​సీజన్​గా భావిస్తాయి. కానీ, గత రెండు సంవత్సరాల ట్రాక్​ రికార్డు చూసుకుంటే.. ఈ మలి నెల కూడా మంచి విజయాలు సాధించి పెట్టింది. అయితే ఈసారి అగ్ర తారల సందడి లేకున్నా.. ధనుష్‌, కల్యాణ్‌ రామ్‌ లాంటి హీరోల సినిమాలతో పాటు పలువురు యువ కథానాయకుల చిత్రాలు బరిలో నిలిచాయి. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. కాగా, ఇందులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే అంచనాలను అందుకున్నాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు చూపించిన సినిమాలు ఏవీ లేవు. ఫిబ్రవరిలో నిరాశపర్చిన సినిమాలివే..

tollywood movies released in february 2023

'భీమ్లా నాయక్‌', 'ఉప్పెన', 'డీజే టిల్లు', 'జాంబిరెడ్డి', 'నాంది', .. గత రెండు సంవత్సరాలలో ఫిబ్రవరి నెల హిట్‌ ట్రాక్‌ ఇది. రవితేజ, అజిత్‌, పవన్‌ కల్యాణ్‌, మోహన్‌బాబు.. లాంటి అగ్ర నటుల సినిమాలన్నీ గతేడాది ఫిబ్రవరిలోనే విడుదలయ్యాయి. అన్‌ సీజన్‌ అయినా అదిరే వినోదాలు పంచిచ్చాయి. కాగా, ఈనెల ఆరంభంలో బాక్సాఫీస్‌ బరిలో నిలిచిన సినిమాల లిస్టు చూస్తే.. ఈసారీ అదే మ్యాజిక్‌ రిపీట్​ అవుతుందనుకున్నారంతా. సమంత, ధనుష్‌, కల్యాణ్‌ రామ్‌ లాంటి తారలతో పాటు యువతరంలో క్రేజ్‌ ఉన్న విష్వక్‌ సేన్‌, సందీప్‌ కిషన్‌ లాంటి యువ కథానాయకుల చిత్రాలు కూడా రేసులో ఉండటమే దీనికి కారణం. కానీ, ఊహించని విధంగా సమంత నటించిన 'శాకుంతలం', విష్వక్‌ సేన్‌ 'దాస్‌ కా ధమ్కీ' లాంటి పాన్‌ ఇండియా సినిమాలు వాయిదా పడటం వల్ల మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

కల్యాణ్ రామ్​, ధనుష్

ఈ నెల మొదటి వారం సందీప్‌ కిషన్‌ 'మైఖేల్‌', సుహాస్‌ 'రైటర్‌ పద్మభూషణ్‌' చిత్రాలతో పాటు 'ప్రేమదేశం', 'రెబల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం' అనే మరో రెండు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ అన్ని చిత్రాల్లో 'రైటర్‌ పద్మభూషణ్‌' సినిమానే హిట్​ టాక్​ సంపాదించింది. ఈ మూవీతో సుహాస్‌ హీరోగా మరో మెట్టు పైకెక్కారు. 'మైఖేల్‌'తో పాన్‌ ఇండియా రేంజ్​లో గుర్తింపు తెచ్చుకోవాలన్న సందీప్‌కిషన్‌ ఆశలు నెరవేరలేదు. రంజిత్‌ జయకోడి తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కాగా, 'బుట్టబొమ్మ' సినిమాతో చైల్డ్​ ఆర్టిస్టు అనికా సురేంద్ర మరో మెట్టు ఎక్కింది. ఈ సినిమాలో సూర్య వశిష్ఠ, అనికా సురేంద్ర నాయకానాయికలుగా నటించారు. వీరితో పాటు శౌరి చంద్ర శేఖర్‌ రమేష్‌ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాపై ట్రైలర్​తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఫిబ్రవరి 4న రిలీజైన 'బుట్టబొమ్మ' వెండితెరపై పూర్తిగా తేలిపోయింది.

ఇక, ఫిబ్రవరి రెండో వారానికి 'వేద' చిత్రంతో స్వాగతం పలికారు కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌. ఫిబ్రవరి 9న విడుదలైన 'వేద' బాక్సాఫీసు వద్ద చేదు ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాతి రోజే 'అమిగోస్‌'తో ప్రేక్షకులముందుకొచ్చారు నందమూరి కల్యాణ్‌రామ్‌. 'బింబిసార' లాంటి హిట్‌ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా.. అందులోనూ ఈ సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం చేయడం వల్ల ప్రేక్షకుల్లో దీనిపై మంచి హైప్​ క్రియోట్​ అయింది. అయితే, ప్రారంభ కలెక్షన్లు వచ్చినప్పటికీ.. డివైడ్​ టాక్​ రావడం వల్ల.. వసూళ్లు పడిపోయాయి. అమిగోస్​తో పాటు అదే రోజు విడుదలైన అవికా గోర్‌ 'పాప్‌ కార్న్‌', బాబీ సింహా 'వసంత కోకిల' చిత్రాలు నిరాశపరిచాయి.

సంతోష్​ శోభన్, సందీప్​ కిషన్, కిరణ్​ అబ్బవరం

మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి మూడో వారంలో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. తమిళ స్టార్​ ధనుష్​ నటించిన 'సార్‌' ఫిబ్రవరి 17న, టాలీవుడ్​ యువ హీరోలు కిరణ్ అబ్బవరం, సంతోష్‌ శోభన్‌ నటించిన 'వినరో భాగ్యము విష్ణుకథ', 'శ్రీదేవి శోభన్‌' చిత్రాలు 18న విడుదలయ్యాయి. ఇందులో 'సార్‌' సినిమా ఇచ్చిన సందేశానికి.. వినోదాలు పంచిన 'వినరో భాగ్యము విష్ణుకథ'కు మంచి మార్కులు పడ్డాయి. మలి నెల చివరి వారంలో 'మిస్టర్‌ కింగ్‌', 'కోనసీమ థగ్స్‌' లాంటి రెండు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. కానీ, అవి ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దీంతో ఈవారం కూడా 'సార్‌', 'వినరో భాగ్యము విష్ణుకథ' వసూళ్లు పెరిగే అవకాశముంది. మొత్తంగా ఈనెల డజనుకు పైగా చిత్రాలు విడుదలైతే.. వాటిలో మూడు చిత్రాలే హిట్​ టాక్​ సొంతం చేసుకున్నాయి. కాగా, మార్చి నుంచి వేసవి సినిమాల సందడి మొదలు కానుంది. ఆ సినిమాలు కూడా మంచి బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తే.. 2023 ఫస్ట్​ ఆఫ్​ హిట్టైనట్టే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.