టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ సోమవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుబయ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. బెడ్‌పై బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో తీసుకున్న ఫొటోను ఆమె తన ఇన్స్ట్రాలో షేర్ చేసింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆమె ఫ్యామిలీ వర్గాలు తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని వివాహం చేసుకున్న పూర్ణ. ఆ తర్వతా కొద్ది రోజులకే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఇటీవలే తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై సందడి చేశారు. ఆ ఫొటోలతో బేబీ బంప్లో పలు ఫొటోలను షేర్ చేసింది. పూర్ణ ఈ శుభవార్త చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకంక్షలు తెలుపుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇటీవలే రిలీజైన నాని సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించింది పూర్ణ. తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితురాలైన ఈ మలయాళ హీరోయిన్.. 2004లో 'మంజు పోలోరు పెంకుట్టి' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత మాలీవుడ్‌లో పలు క్యారెక్టర్ రోల్స్ చేసిన పూర్ణ.. అక్కడ నుంచి టాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. 'శ్రీ మహాలక్ష్మి' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన పూర్ణ ఆ తర్వాత అల్లరి నరేశ్ హీరోగా నటించిన 'సీమ టపాకాయ్' సినిమాతో టాలీవుడ్లో సుపరిచితురాలయ్యింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. 'సీమ టపాకాయి','లడ్డు బాబు' 'నువ్విలా నేనిలా', 'అవును', 'దృశ్యం 2' 'శ్రీమంతుడు', , 'అఖండ' లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇక టాలీవుడ్లో పలు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ... డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ టీవీలో ప్రసారమైన 'ఢీ' అనే డ్యాన్స్ షో కు జడ్జీగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. దీంతో పాటు పలు ప్రోగ్రామ్‌లకు జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేసింది.
దశాబ్దానికి పైగా తెలుగు, మలయాళ, తమిళ, ఇండస్ట్రీల్లో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్న పూర్ణ .. పలు సినిమాల్లో అడపాదడపా కనిపించినప్పటికీ హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. తెలుగులో ఈమె నటించిన ఆఖరి సినిమా 'తీస్ మార్ ఖాన్'. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు బల్లితెరపై కూడా సందడి చేసింది.