ETV Bharat / entertainment

త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న హీరో నాగశౌర్య.. అమ్మాయి ఎవరంటే? - నాగశౌర్య లేటెస్ట్​ అప్డేట్స్​

యువ కథానాయకుడు నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్​ డిజైనర్​ను ఈనెల 20న వివాహం చేసుకోబోతున్నారు.

tollywood actor naga shaurya marriage
tollywood actor naga shaurya
author img

By

Published : Nov 10, 2022, 3:49 PM IST

Updated : Nov 10, 2022, 4:06 PM IST

Naga Shourya Marriage: తన స్మైల్​తో లేడీ ఫ్యాన్స్​లో క్రేజ్​ సంపాదించుకున్న యంగ్ ​హీరో నాగశౌర్య. అమ్మ కొడుకుగా అన్ని ఫంక్షన్స్​లోనూ కనిపించే ఈ హీరో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. నవంబరు 20న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.

బెంగళూరుకు చెందిన ఇంటీరియర్​ డిజైనర్ అనూషను ఈనెల 20న వివాహం చేసుకోబుతున్నారు శౌర్య. గత కొంతకాలం నుంచి అనూషతో శౌర్యకు పరిచయం ఉంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలు వాళ్ల పెళ్లికి అంగీకరించారు. దీంతో ఈ నెల 19, 20వ తేదీల్లో బెంగళూరులో నాగశౌర్య-అనూషల వివాహాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నాగశౌర్య కుటుంబం తెలిపింది. 19న మెహందీ వేడుక, 20న ఉదయం 11.25 నిమిషాలకు పెళ్లి మూహుర్తాన్ని నిర్ణయించారు.

శౌర్య పెళ్లి కబురుతో టాలీవుడ్​లో సందడి నెలకొంది. యువ కథానాయకులంతా శౌర్యకు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నట్లు సందేశాలు పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 'NS24' అనే నయా ప్రాజెక్ట్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు శౌర్య ఇటీవలే ప్రకటించారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస్‌ రావు, విజయ్‌ కుమార్, అరుణ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని చిత్రబృందం వెల్లడించింది.

ఇదీ చదవండి:'హోంబలే' ఫిల్మ్స్​ అర్థమేంటో తెలుసా?.. ఈ ప్రొడక్షన్​ హౌస్​ జర్నీ సాగిందిలా

రామ్​చరణ్​ కొత్త మూవీ అప్డేట్​.. ఛాన్స్ కొట్టేసిన 'బింబిసార' డైరెక్టర్!

Last Updated : Nov 10, 2022, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.