Tollywood August Premieres Release Movies 2023 : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం మేకర్స్‌కు ఉంటే.. ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేందుకు విడుదలకు ముందే ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధమైపోతున్నారు. తన సినిమాలపై ఆడియెన్స్‌లో హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మీడియం బడ్జెట్ మేకర్స్ ఈ తరహా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
Bedurulanka 2012 Premieres : అయితే తాజాగా మరో కొన్ని చిత్రాలు ప్రీమియర్స్‌కు రెడీ అయ్యాయి. 'ఆర్స్ ఎక్స్ 100' హీరో కార్తికేయ నటించిన కొత్త చిత్రం 'బెదురులంక 2012'. 2012 యుగాంతం కాన్సెప్ట్‌తో దర్శకుడు క్లాక్స్ ఈ కామెడీ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఆగస్ట్ 25న సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ఆగస్ట్ 24 గురువారమే స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. గుంటూరు, వైజాగ్, కాకినాడ వంటి నగరాల్లో ప్రీమియర్స్ వేయనున్నారట. ఆన్ లైన్లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయని తెలిసింది. చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న హీరో కార్తికేయకు ఈ మూవీ సక్సెస్‌ను అందుకోవడం ఎంతో ముఖ్యం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Boys Hostel Movie Premieres : అలాగే కన్నడలో చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఓ సినిమాను.. బాయ్స్ హాస్టల్ పేరుతో ఆగస్ట్ 25న రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా విడుదల ముందు రోజు రాత్రి ప్రీమియర్స్‌కు రెడీ అయిందని తెలిసింది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున', మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ 'కింగ్ అఫ్ కొత్త' సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ చిత్రాల విషయంలో ప్రీమియర్స్ మాట ఏమీ వినపడట్లేదు. దుల్కర్.. ఆగస్ట్ 24న రానుండగా.. వరుణ్ తేజ్ తన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 25 ఫ్రైడేనే రానున్నారని అర్థమవుతోంది.
ఇకపోతే గతంలో ఈ ప్రీమియర్లు చాలా సినిమాలకు ప్లస్ అయ్యాయి. ఒకట్రెండు చిత్రాలకు మైనన్గా నిలిచాయి. 777 చార్లీ, మేజర్, రైటర్ పద్మభూషణ్, సామజవరగమణ, మేం ఫేమస్, బేబీ వంటి చిత్రాలు.. ప్రీమియర్స్‌తో హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సృష్టించాయి. అయితే నాగశౌర్య రంగబలి, అశ్విన్ బాబు హిడింబ లాంటి కొన్ని సినిమాలు మాత్రం తేడా కొట్టాయి.య చూడాలి మరి ఈ సారి ప్రీమియర్స్ ఎలాంటి టాక్‌ను అందుకుంటాయో..
Nikki Tamboli Photos : నడుముని విల్లులా వంచి హీట్ పెంచుతూ.. ధర్మామీటర్ పగిలిపోవాల్సిందే!