Tiger Nageswara Rao Openings : టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన కొత్త చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' మరో ఐదు రోజుల్లో గ్రాండ్‌గా రిలీజయ్యేందుకు రెడీ అయింది. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి ఒక రోజు ముందే బాలకృష్ణ భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో పోటీగా రానున్నాయి.
ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే బెస్ట్ అండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రవితేజ ఫ్యాన్స్ కూడా సినిమా పక్కా భారీ విజయాన్ని నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో రవితేజ లుక్, యాక్టింగ్ అంతా మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. అలాగే సినిమా స్టాండర్డ్స్ కూడా భారీగా ఉన్నాయి. అందుకే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ నటించి గత చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో ధమాకా రూ.4.66కోట్లు, రావణాసుర రూ.4.29కోట్లు, ఖిలాడీ రూ.4.30కోట్లు, , రామారావు ఆన్ డ్యూటీ రూ.2.82కోట్లు, క్రాక్ రూ.6.25కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని రూ.3.40కోట్లు, డిస్కో రాజా రూ.2.54కోట్లు కలెక్షన్లను అందుకున్నాయి. వీటిలో క్రాక్ సినిమానే భారీ ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ తర్వాత రావణాసుర, ధమాకా మంచి ఓపెనింగ్స్‌ను అందుకున్నాయి. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు కనీసం రూ.4.5 కోట్ల నుంచి రూ.5కోట్ల రేంజ్లో సాధిస్తుందని అనిపిస్తోంది. మరి ఈ చిత్రం రూ.5 కోట్ల వరకు ఓపెనింగ్స్ అందుకుంటుందా లేదంటే క్రాక్ ఓపెనింగ్స్‌ను అధిగమిస్తుందా అనేది చూడాలి..
Tiger Nageswara Rao Release Date : టైగర్ నాగేశ్వరరావు విషయానికొస్తే.. ఈ సినిమా స్టువర్ట్పురం గజదొంగ జీవిత ఆధారంగా తెరకెక్కించారు. రేణూ దేశాయ్ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. రన్‌టైమ్ ఏకంగా 3.02 గంటలు ఉంది. ఈ సినిమాను సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్)లోనూ విడుదల చేయనుండటం విశేషం. Tiger Nageswararao Rao Theatres : టైగర్.. హైప్ లేదా? లేక కావాలనే వారు స్క్రీన్స్ ఇవ్వట్లేదా?
Yash Ravi Teja : యశ్ గురించి రవితేజ అలా అనేశారేంటి.. ఫ్యాన్స్ గుస్సా!