ETV Bharat / entertainment

ఈ వారమే 'ఆచార్య'.. ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే? - చిరంజీవి ఆచార్య సినిమా రిలీజ్ డేట్​

మెగాఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆచార్య' సినిమా ఈ వారమే విడుదల కానుంది. దీంతో పాటే మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో చూసేద్దాం..

Acharya release date
ఆచార్య రిలీజ్ డేట్
author img

By

Published : Apr 25, 2022, 11:55 AM IST

This week Release movies: బాక్సాఫీస్‌ వద్ద 'ఆర్‌ఆర్‌ఆర్‌','కేజీయఫ్‌2'ల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ చివరి వారంలో మరో పెద్ద సినిమా వీటికి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం రిలీజ్​ కానున్న ఆ చిత్రాలేంటో చూసేద్దాం!

Chiranjeevi Acharya movie release date: అగ్ర కథానాయకుడు చిరంజీవి నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు 'ఆచార్య'గా అలరించబోతున్నారు. కమర్షియల్‌ సినిమాలకు సందేశాన్ని జోడించి చెప్పటంలో సిద్ధహస్తుడైన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'ధర్మస్థలి' అనే ప్రాంతం చుట్టూ తిరిగే కథతో అభిమానులను అలరించేలా కొరటాల శివ సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. ఇక తెరపై చిరు-చరణ్‌ కనిపించే సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తండ్రీకొడుకుల మేజిక్‌ చూడాలంటే ఏప్రిల్‌ 29వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Vijaysethupati Kathuvakula rendu kathal movie release date: చిరంజీవి సినిమా వస్తుందంటే మరో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక-నిర్మాతలు వెనకడుగు వేస్తారు. కానీ, ఓ ఆసక్తికర తమిళసినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కించిన చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్‌'. తెలుగులో 'కణ్మని రాంబో ఖతీజా' పేరుతో విడుదల కానుంది. ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇద్దరితోనూ అతను పడిన కష్టాలేంటి? చివరకు ఇద్దరి మనసులను గెలుచుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఏప్రిల్‌ 28న 'కణ్మని రాంబో ఖతీజా' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ajaydevgan Runway 34 movie: బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌దేవగణ్‌ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం 'రన్‌వే 34'. అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. విమానయాన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్‌, రకుల్‌ పైలట్లుగా, అమితాబ్‌ విచారణాధికారిగా నటిస్తున్నారు.

ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలు..

నెట్‌ఫ్లిక్స్‌

  • గంగూబాయి కథియావాడి(తెలుగు) ఏప్రిల్‌ 26
  • 365 డేస్‌: ది డే(హాలీవుడ్‌)
  • మిషన్‌ ఇంపాజిబుల్‌ (తెలుగు) ఏప్రిల్‌ 29
  • ఓ జార్క్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌29

ఊట్‌

  • బేక్డ్‌ (హిందీ సిరీస్‌-3) ఏప్రిల్‌ 25
  • ద ఆఫర్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

అనుపమా: నమస్తే అమెరికా (హిందీ) ఏప్రిల్‌ 25
జీ5
నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ (హిందీ) ఏప్రిల్‌ 29

ఇదీ చూడండి: Acharya: కాజల్​ పాత్రపై దర్శకుడు కొరటాల క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.