ETV Bharat / entertainment

The Vaccine War First Look : 'వ్యాక్సిన్​ వార్'​ ఫస్ట్​ లుక్​ పోస్టర్​.. రియలిస్టిక్ లొకేషన్స్​లో షూటింగ్​.. - ది వ్యాక్సిన్​ వార్​ మూవీ ఫస్ట్​ లుక్​ పోస్టర్​

The Vaccine War First Look : 'ది కశ్మీర్​ ఫైల్స్​' సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన బాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం 'ది వ్యాక్సిన్​ వార్'​ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెప్టెంబర్​ 28న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ లుక్ పోస్టర్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఇంతకీ ఈ 'వ్యాక్సిన్​ వార్'​ స్టోరీ ఏంటంటే..

the vaccine war first look
the vaccine war first look
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 12:49 PM IST

The Vaccine War First Look : వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలు తెరకెక్కించడంలో బాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ వివేక్ అగ్నిహోత్రికి మంచి పేరుంది. 'ది కశ్మీర్​ ఫైల్స్​' సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా 'ది వ్యాక్సిన్​ వార్'​ సినిమాను తెరకెక్కించారు. సుమారు 11 భాషల్లో విడుదలవ్వనున్న ఈ సినిమా సెప్టెంబర్​ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్​ తాజాగా సినిమా ఫస్ట్​ లుక్​ పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. అందులో సీనియర్​ హీరో నానా పాటేకర్​, 'ది కశ్మీర్ ఫైల్స్'​ ఫేమ్​ నటి పల్లవి జోషి, సీనియర్ స్టార్​ అనుపమ్ ఖేర్​, 'కాంతార' హీరోయిన్​ సప్తమి గౌడ​ ఉన్నారు.

ప్రపంచమంతటా కొవిడ్​ వ్యాప్తించి ప్రజలు భయభ్రాంతులతో వణుకున్న సమయంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఓ వాక్సిన్‌ తయారైంది. ఈ టీకాను భారత్​లోని పలువురు శాస్త్రవేతలు కనుగొన్నారు. ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ- పుణెతో కలిసి ఆ టీకాను మన దేశంలో తయారు చేశారు. ఆ వాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఎందరికో ప్రాణదానం చేశారు. అలా ఒక్క టీకాతో ప్రపంచం మొత్తాన్ని మన వైపుకు చూసేలా చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి ఈ సినిమాను తీస్తున్నట్లు వివేక్​ తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్‌ను తయారుచేయడంలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర కూడా ఉందని వారి గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్థావించినట్లు ఆయన వెల్లడించారు.

వ్యాక్సిన్​ కనుగొనే సమయంలో శాస్త్రవేత్తలు పడిన ఒత్తిడితో పాటు వారు చేసిన ప్రయోగాలను కళ్లకు కట్టినట్టుగా చూపించానన్నారు. ఐసీఎంఆర్​ నుంచి నిజమైన కోతులును తెప్పించి వాటిని సినిమాలో చూపించారట. అంతే కాకుండా సినిమా మొత్తం రియల్​ లొకేషన్స్​లోనే షూట్​ చేసినట్లు తెలిపారు. బయో సేఫ్టీ లెవెల్ ల్యాబ్స్​లో సినిమాను చిత్రీకరించిన ఆయన.. ఇటువంటి నిజమైన లొకేషన్​లో షూట్​ చేసిన మొదటి సినిమా 'వ్యాక్సిన్​ వార్​' అని చెప్పుకొచ్చారు.

'నేను అలా అనలేదు.. ఆయన చాలా పెద్ద స్టార్​'.. ప్రభాస్​తో క్లాష్​పై వివేక్​ క్లారిటీ

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. 'ది వ్యాక్సిన్ వార్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.