'ఇస్మార్ట్ శంకర్' వంటి హిట్ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం కావడం, విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా అవడంతో 'లైగర్'ను ప్రకటించిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలతో మరిన్ని అంచనాలు నెలకొల్పాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో విజయ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? అసలు లైగర్ థీమ్ ఏంటి? అనే సందేహాలకు తాజాగా సమాధానం దొరికినట్టైంది. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా 'లైగర్ హంట్' పేరిట లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పవర్‌ఫుల్ గీతం అన్ని వర్గాల వారిని అలరించేలా ఉంది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం విజయ్ తన శరీరాకృతిని మార్చుకున్న సంగతి తెలిసిందే. సిక్స్‌ప్యాక్ బాడీతోపాటు పొడవాటి జుత్తుతో సరికొత్తగా కనిపించాడు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే అలరించనుంది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూరీ కనెక్ట్స్, ధర్మ పొడ్రక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హో సీతా వదలనిక తోడవుతా..' ఎప్పటికప్పుడు తన నటనతో ప్రత్యేకతను చాటుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ యంగ్ హీరోకు తెలుగులో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ హీరో నటిస్తోన్న సినిమా 'సీతా రామం'. స్వప్న సినిమా పతాకంపై వస్తోన్న ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 'హో సీతా వదలనిక తోడవుతా..' అంటూ సాగే ఈ ఫీల్ గుడ్ సాంగ్‌ను ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ రాయగా.. ఎస్‌పీ చరణ్, రమ్య బెహరా అలపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాటను విడుదల చేస్తూ చిత్రబృందం 'మరోసారి సీతారాముల ప్రేమకథను చూడండి' అంటూ ట్విట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రష్మిక కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో దుల్కర్ సరసన మృణాళిని ఠాకూర్ నటిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రేమకథా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయళ భాషల్లో ఒకేసారి అలరించనున్న ఈ సినిమాకు పి.ఎస్.వినోద్ ఛాయగ్రహణ బాధ్యతలు చేపట్టారు.
'పృధ్వీరాజ్' ట్రైలర్ 'మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ.. మా దేశం నుంచి పిడికెడంత మట్టి కూడా మీ సుల్తాన్‌కివ్వం' అని అంటున్నారు అక్షయ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా 'పృధ్వీరాజ్'. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మానుషి కథానాయిక. జూన్ 3న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా 'పృధ్వీరాజ్' ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. 'ఉత్తరాధికారిని బంధురీత్యా కాదు యోగ్యతతో ఎంచుకుంటారు. శౌర్యానికి, వీరత్వానికి ఇంకా న్యాయం కోసం.. పృధ్వీరాజ్ చౌహాన్‌కి దిల్లీ సింహాసనంపై పట్టాభిషేకం చేస్తున్నాం' అంటూ ట్రైలర్‌లో అక్షయ్ పాత్రని పరిచయం చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇందులో పృధ్వీరాజ్ గురువుగా చంద్ పాత్రలో సోనూసూద్ నటించారు. 'వాల్మీకి వల్లే శ్రీరాముడు ఉన్నాడు. చంద్ వల్లే ఈ పృధ్వీరాజ్ చౌహాన్ ఉంటాడు' అంటూ అక్షయ్ చెప్పే డైలాగ్ మెప్పించేలా ఉంది. ఇక, ట్రైలర్ చివర్లో.. 'ధర్మం కోసమే జీవిస్తాను. ధర్మం కోసమే మరణిస్తాను' అంటూ ఆయన చెప్పే డైలాగ్, సింహాలతో పోరాడిన తీరు, పోరాట సన్నివేశాలు.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆ 45 నిమిషాలు థియేటర్ ఊగిపోతుంది: మహేశ్‌బాబు